నమస్కారం. ఒక ఆందోళన లేదా నిరసన ద్వారా తక్షణమే ఒక ఫలితం వచ్చేస్తే… ఇక ప్రతీసారీ అదే పద్ధతి పనిచేస్తుందా? ఇంట్లో ఎంత భద్రత ఉన్నా ఎప్పుడో ఒకసారి దొంగతనం జరగొచ్చు, అంతమాత్రాన ఇల్లే సురక్షితం కాదనగలమా? బెదిరింపులు, భయాందోళనలు, అరాచకాలతో సాధించే విజయాలు అసలు ఎప్పటికైనా నిలబడతాయా? అణచివేతపై గళం విప్పడం రాజ్యాంగం ఇచ్చిన హక్కే… కానీ ఆ నిరసన పేరుతో రాళ్లు రువ్వడం, బస్సులు-రైళ్లు తగలబెట్టడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం నిజంగా నిరసన అనిపించుకుంటుందా లేక నేరమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
సిజెపి పార్టీ చేస్తున్న ఉద్రిక్త ఆందోళనల వల్ల వాళ్ల డిమాండ్లు నెరవేరాయేమో కానీ, దాన్ని చూసుకొని విర్రవీగడం ఎంతమాత్రం సరైంది కాదు. మొదట విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టి సాధించారు. ఇప్పుడు ఏకంగా హోం మంత్రి రాజీనామా చేయాలని అడుగుతున్నారు. రేపు పొద్దున్న వెళ్లి ప్రధాన మంత్రి కూడా రాజీనామా చేయాలంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన దేశపు చట్టం, ప్రజాస్వామ్య వ్యవస్థ, భారతీయ సమాజం ఇలాంటి హింసాత్మక మార్గాలను, బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎప్పటికీ ఆమోదించవు. వేలాది మంది విద్యార్థుల్లో కొద్దిమంది రాజకీయ స్వార్థపరుల లేదా అదృశ్య శక్తుల బ్రెయిన్‌వాష్‌కు బలికావచ్చు… కానీ లక్షలాది మంది భారతీయ యువత ఎప్పుడూ దేశభక్తితోనే ఉన్నారు. పక్క దేశాల్లో జరిగే సైనిక తిరుగుబాట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చే కుట్రలు మన భారతీయ నేల మీద ఎప్పటికీ సాధ్యం కావు. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారి వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకునే మన యువతకు, అశాంతిని ప్రేరేపించే పద్ధతులు పూర్తిగా విరుద్ధం.
రాజ్యాంగ పరిధి దాటి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తీవ్రమైన నేరం. ప్రజా ఆస్తులు అంటే ఏ ఒక్కరివో కావు, మన కష్టార్జితం నుంచి కట్టిన పన్నుల డబ్బు. వాటిని తగలబెట్టడం అంటే మన ఇల్లు మనమే కాల్చుకోవడమే! రాజకీయనాయకులపై, మహిళలపై జుగుప్సాకరమైన భాష వాడటం భారతీయ సంస్కృతి అనిపించుకోదు. ఇన్ఫ్లుయెన్సర్లు, మేధావులు, రాజకీయ నాయకులు యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన యువత చేతుల్లో పట్టుకోవాల్సింది పుస్తకాలు, సాంకేతికత, దేశాన్ని నడిపించే ప్రాజెక్టులు… అంతేకానీ రాళ్లు, పెట్రోల్ బాంబులు కావు! సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కుర్రాళ్ల భవిష్యత్తును బలిచేసే అరాచక మార్గాలను ఈ సమాజం ఎప్పటికీ క్షమించదు, ప్రశ్నిస్తూనే ఉంటుంది.
తాత్కాలిక ఉద్రేకాలు, ఉచిత ప్రచారాలు ఏనాటికీ దేశాన్ని నిర్మించలేవు. కేవలం శాంతి, క్రమశిక్షణ, కఠినమైన కష్టం మాత్రమే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనమంతా సమాజ హితం కోసం పనిచేద్దాం. దేశ యువత మేల్కొని నిజమైన ధర్మాన్ని, ప్రజాస్వామ్య న్యాయాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
దేశహితం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం మరియు జాతీయ పాదాన్ని గట్టిగా వినిపిస్తున్న మన myind media ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు!



