………
కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే అసలు రంగు బయటపడింది. ప్రజలు, యువత సంక్షేమం పేరుతో ఒక డ్రామాను నడుపుతున్న ఈ నాయకుడి వెనుక నిలబడింది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లేననే నగ్న సత్యం వెలుగులోకి వచ్చింది. సామాన్యులను మభ్యపెట్టడానికి విచిత్రమైన పేర్లతో వచ్చిన ఈ ముసుగు పార్టీకి, వెనుక నుంచి నిధుల ప్రవాహం సాగుతోందనే ఆరోపణలు ఇప్పుడు గట్టిగా వినపడుతున్నాయి.
..
విశ్వసనీయ వర్గాల ప్రకారం, అభిజిత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తి చేసి, విదేశాల్లో సాగించిన విలాసవంతమైన జీవితానికి వెనుక భారీ స్థాయిలో నిధులు అందాయి. వాస్తవానికి అబిజిత్ తండ్రి ఒక రిటైర్డ్ ఉద్యోగి. చాలా సాధారణ కుటుంబం. అటువంటి అప్పుడు అతనికి అంతటి విలాసవంతమైన జీవితం ఎలా సాధ్యమైంది అనేది ప్రశ్న.
గతంలో ఆప్ సోషల్ మీడియా బృందంలో ఈయన పనిచేశారు. అప్పటినుంచి అతని దశ తిరిగింది.
….
ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల అభయహస్తంతో స్వదేశంలో అల్లర్లు సృష్టించే కుట్రలకు తెరలేపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనల నిర్వహణకు, దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఆప్, కాంగ్రెస్ పార్టీలే ఆర్థిక వనరులను సమకూర్చాయనేది బహిరంగ రహస్యం.
…….
కోట్లలో ఖర్చు: అసలు ఉదాహరణలు ఇవే!
కోట్ల రూపాయల సోషల్ మీడియా ప్రచారం: AI టూల్స్ సహాయంతో డిజిటల్ కంటెంట్ రూపొందించడం, పేజ్ ప్రమోషన్లు, మరియు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను తక్షణమే పెంచుకోవడం కోసం కోట్ల రూపాయలను పెయిడ్ పిఆర్ ప్రచారాలకు గుమ్మరించారు. ఓ సామాన్య సంస్థకు ఇది సాధ్యం కాదు.
లీగల్ డిఫెన్స్ ఫండ్స్: వివాదాల్లో చిక్కుకున్న కాక్రోచ్ పార్టీ కోసం కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ ద్వారా రూ. 1 కోటి రూపాయలు లీగల్ డిఫెన్స్ ఫండ్ ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన వెనుక ఎవరున్నారో తేలికగా అర్థం చేసుకోవచ్చు.
ఢిల్లీ ధర్నాలు & వసతి వ్యయం: జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన ధర్నాల కోసం వేలాది మందికి రవాణా, ఆహారం, సౌండ్ సిస్టమ్స్, పందిళ్ళు ఏర్పాటుకు రోజుకు లక్షల్లో ఖర్చు పెట్టారు. ఈ భారీ ఖర్చు వెనుక కాంగ్రెస్, ఆప్ నేతల ప్రత్యక్ష వనరులే ఆధారమని స్పష్టమవుతోంది.
………………………
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో సుస్థిరమైన పాలనను, నవభారత అభివృద్ధిని అందిస్తోంది. దేశీయంగా అభివృద్ధి వేగవంతం అవుతుండటం, బిజెపికి ప్రజల్లో పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఇటువంటి దొంగచాటు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. నేరుగా మోదీని ఎదుర్కొనే ధైర్యం లేక, కాక్రోచ్ పార్టీని తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని, నిరుద్యోగ యువత భావోద్వేగాలను ఉపయోగించుకుని తమ జేబులు నింపుకోవడమే కాకుండా, ప్రత్యక్షంగా దేశంలో అసంతృప్తిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
…..
నిజానికి ,, కాంగ్రెస్, ఆప్ ల కుట్రలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుంటే, ఇటువంటి కుట్రల రాజకీయాలు మోదీ ప్రజాదరణ ముందు ఎంతమాత్రం నిలబడవని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.



