………………
దేశంలో ఉద్యోగాలు కల్పిస్తూ, వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్న స్వదేశీ పరిశ్రమలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారా? దేశం ఆపదలో ఉన్నప్పుడు ఓదార్పు మాటలకే పరిమితమయ్యే కుహానా వాదులు, సెక్యులరిస్టులు.. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగి అస్సాం విలవిలలాడుతుంటే ఎక్కడున్నారు? బిజినెస్ గ్రూపుల ఉనికినే ప్రశ్నించే ఈ ద్వంద్వ వైఖరి వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి? నకిలీ సోషలిజం ముసుగులో దేశ ప్రగతిని, స్వచ్ఛంద సేవలను తక్కువ చేసి చూపడం వెనుక అర్థం ఏమిటి?
………………………..
దేశంలో ఆర్థిక ప్రగతిని పరుగులు తీస్తూ రిలయన్స్ గ్రూప్ లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఒక్క రిలయన్స్ పరిశ్రమల ద్వారానే కాకుండా రీటైల్, టెలికాం, డిజిటల్ నెట్‌వర్క్‌ల రూపంలో దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థకు అపారమైన రాబడిని అందిస్తూ, దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్న ఈ మేక్ ఇన్ ఇండియా ప్రతినిధులపై సెక్యులరిస్టులు నిరంతరం విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఉపాధి కల్పనలో గానీ, దేశీయ వృద్ధిలో గానీ సున్నా పాత్ర పోషించే ఈ వర్గాలు, వెనుకబడిపోయిన ప్రాంతాల్లో వ్యవస్థలను నిర్మిస్తున్న స్వదేశీ కార్పొరేట్ సంస్థలను కేవలం ద్వేషంతో మాత్రమే చూస్తున్నాయి.
కానీ మాటల కంటే చేతలే గొప్పవి అని రిలయన్స్ మరోసారి నిరూపించింది.
….
తాజాగా అస్సాంలో సంభవించిన తీవ్ర వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన వేలాది కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. కేవలం విరాళంతో సరిపెట్టకుండా బాధితులను ఆదుకోవడానికి శివసాగర్, చరైడియో లాంటి తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. కమ్యూనిటీ కిచెన్ల ద్వారా వేలాది మందికి ఆహారం అందించడమే కాకుండా తాగునీరు, పారిశుధ్య పనులు, తాత్కాలిక ఆశ్రయాలు, ప్రజారోగ్య కేంద్రాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. మనుషులతో పాటు ‘వంతారా’ బృందాల ద్వారా సుమారు 4,000 పశువులకు, మూగజీవాలకు పశుగ్రాసం, వైద్య సహాయాన్ని అందిస్తూ అస్సాం ప్రజలకు కొండంత అండగా నిలిచారు.
………………………
కష్ట కాలంలో ప్రజా సంక్షేమం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తూ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలను ప్రోత్సహించాల్సింది పోయి.. నిరంతరం ఉచిత విమర్శలతో ఏడవడం ఈ సెక్యులరిస్ట్ వర్గాల దివాళాకోరుతనానికి నిదర్శనం. ఇదంతా CSR ఫండ్స్ అంటూ బుడి బుడి రాగాలు తీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వదేశీ పారిశ్రామిక వేత్తలను, వారి సేవా గుణాన్ని కించపరిచే నకిలీ సిద్ధాంతాలను భారత ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు.
……..
దేశ ఆర్థిక అభివృద్ధిని, జాతీయ ప్రయోజనాలను మరియు నిజమైన మానవతా దృక్పథాన్ని బలంగా వినిపిస్తున్న మీ అభిమాన MyInd Media ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్!



