వికీపీడియా కమ్యూనిస్టు రాతలే.. బండారం బట్టబయలు..!! వికీపీడియా సహ వ్యవస్థాపకుడి మీద నిషేధం..
……………
ప్రముఖ ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వం ‘వికీపీడియా’ తన సహ వ్యవస్థాపకుడైన లారీ సాంగర్పై శాశ్వత నిషేధం విధించింది. వికీపీడియాలో పెరుగుతున్న పక్షపాత వైఖరిని ఆయన నిరంతరం విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంస్థ ఆయన ఖాతాను బ్లాక్ చేయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఫ్రీ ఎన్సైక్లోపీడియాగా చెప్పుకునే వేదికలో వాక్ స్వాతంత్ర్యం ఎక్కడుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
………..
వికీపీడియా ప్రస్తుతం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అడ్డాగా మారిందని లారీ సాంగర్ వెల్లడించారు. సంస్థలోని కొందరు ఎడిటర్లు ఉద్దేశపూర్వకంగానే ఏకపక్ష సెన్సార్షిప్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తటస్థ సమాచారాన్ని అందించాల్సిన వేదిక, కమ్యూనిస్టు కాంగ్రెస్ రాజకీయ ఎజెండాను మాత్రమే ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలను దాచిపెట్టి పాఠకులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
………
ముఖ్యంగా హిందూ మతం, భారతీయ సంస్కృతిపై వికీపీడియాలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోందని సాంగర్ ఎత్తిచూపారు. హిందూ పండుగలు, సాంప్రదాయాలకు సంబంధించిన వ్యాసాలలో కావాలనే ప్రతికూల సమాచారాన్ని చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను సరిచేయడానికి ప్రయత్నించే వారిపై నిబంధనల పేరుతో వేటు వేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ రకమైన హిందూ వ్యతిరేక ధోరణి సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోందన్నారు.
……….
తాజా నిషేధంతో వికీపీడియా నిష్పాక్షికతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు అందరికీ సమాన అవకాశం కల్పించిన ఈ వేదిక, ఇప్పుడు పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. సొంత వ్యవస్థాపకుడినే బ్యాన్ చేయడాన్ని బట్టి చూస్తే, అక్కడ అసమ్మతికి తావులేదని స్పష్టమవుతోంది. ఈ పరిణామం డిజిటల్ మీడియాలో సమాచార స్వేచ్ఛపై సరికొత్త వివాదాన్ని రేకెత్తించింది.



