……………………………………………….
నమస్తే! దేశంలో రాజ్యాంగ సంస్థలను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ …. పూర్తిగా నాన్-మెయింటైనబుల్ అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సర్ ప్రక్రియ మీద ఆర్డర్స్ అన్నీ… ముగ్గురు కమిషనర్లు కలిసి ఏకగ్రీవంగా తీసుకున్నవేనని ECI తేల్చిచెప్పింది. కేవలం ఒక మీడియా కథనాన్ని నమ్ముకుని రాజ్యాంగ సంస్థపై బురదజల్లేశారు. కాక్రోచ్ పార్టీ అయితే ఏకంగా కమీషనర్స్ రాజీనామా చేయాలని హడావుడి చేసేసింది. ఈ రాజకీయ కుట్ర వెనుక అసలు నిజాలు ఏంటి? దీనిపై ECI ఇచ్చిన సంచలన క్లారిటీ ఏంటి? ఒకసారి వివరంగా చూద్దామ్..
………………………………………………………………………….
ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ గతంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయి. దీన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్, కాక్రోచ్ పార్టీలు గందరగోళం చేసేశాయి. CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేశాయి. అయితే సుప్రీంకోర్టులో దీని మీద పిటీషన్ కూడా వేసేశారు. దీనికి వేసిన కౌంటర్ అఫిడవిట్లో… ఈ ఆరోపణలన్నింటినీ ఎన్నికల సంఘం గట్టిగా తిప్పికొట్టింది. జూన్ 2025, అక్టోబర్ 2025 మరియు మే 2026 లో జరిపిన అన్ని SIR ఆర్డర్లు కూడా CEC మరియు ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని స్పష్టం చేసింది.
……..
ఫామ్ 6 విషయంలోనూ ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం ఆన్లైన్ డిస్ప్లేలో వచ్చిన చిన్న కన్ఫ్యూజన్ను సరిదిద్దడానికి అక్టోబర్ 21 నుంచే ప్రాసెస్‌ను వేరు చేశామని ECI క్లారిటీ ఇచ్చింది. ఓటర్ల వెరిఫికేషన్ కోసం ఎవరూ అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. , బూత్ లెవెల్ ఆఫీసర్లే నేరుగా ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తారని తెలిపింది. సుప్రీంకోర్టు జడ్జితో సమానంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉన్న CEC పై ఇలాంటి నిరాధారమైన పిటిషన్లు వేయడం చట్టవిరుద్ధమని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్న ఈ ప్రతిపక్షాల తీరు ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి!
………………………………………..
రాజ్యాంగ సంస్థలను అస్థిరపరుస్తూ, వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసే ఇలాంటి చీప్ పాలిటిక్స్‌ను ఎప్పుడూ ఖండించాలి. తప్పుడు వార్తలతో వ్యవస్థలను బద్నామ్ చేసే వారి కుట్రలను ప్రజలంతా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ చెత్త రాజకీయాలపై.. మీ Opinion ఏంటో కింద Comments లో చెప్పండి!
……
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!



