ప్రధాని నరేంద్ర మోదీ దూరద్రుష్టి తో.. భారతదేశ రక్షణ రంగం సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. హిందూ మహాసముద్రంలో చైనా కు అడ్డుకట్ట వేసేందుకు మోదీ ఒక వ్యూహాన్ని పన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌ను ప్రపంచ మహాశక్తిగా నిలబెడుతున్నారు. దీనికి నిదర్శనంగా, భారత నౌకాదళంలోకి ఒకే రోజున మూడు అత్యాధునిక యుద్ధనౌకలను ప్రవేశపెట్టారు. ఇది రక్షణరంగ చరిత్రలో ఒక మైలురాయి.
……………………………………………….
ప్రపంచ దేశాలు ఆశ్యర్యపోయేలా ఒకే రోజున మూడు యుద్ధనౌకలను చేర్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు జనవరి 2025లో కూడా మోదీ ప్రభుత్వం ఒకేసారి మూడు నౌకలను ప్రవేశపెట్టింది. సముద్రంలో ఎదురవుతున్న చైనా సవాళ్లను ముందుగానే పసిగట్టి, వాటిని తిప్పికొట్టేలా ఈ మూడు నౌకలను అస్త్రాలుగా మలిచారు.
…………….
INS దునగిరి: ఇది బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన స్టెల్త్ ఫ్రిగేట్. ఇది నౌకాదళానికి తిరుగులేని క్షిపణి శక్తిని అందిస్తుంది.
INS అగ్రయ్: ఇది యాంటీ-సబ్‌మెరైన్ నౌక. ఇది హిందూ మహాసముద్రంలో శత్రు జలాంతర్గాములను వేటాడటంలో కీలకంగా మారుతుంది.
INS సంశోధక్: ఇది అత్యాధునిక సర్వే నౌక. ఇది సముద్ర గర్భాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వ్యూహాత్మక పైచేయి సాధించేలా చేస్తుంది.
……………………………………………………………………….
ప్రధాని మోదీ నినాదమైన స్వదేశీ ఉత్పాదకతకు ఈ నౌకలు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ మూడు యుద్ధనౌకల్లో ఏకంగా 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి నలిగేవనే అపవాదును మోదీ ప్రభుత్వం చెరిపేసింది. ఇతర దేశాలను భయపెట్టే రీతిలో మన యుద్ధ నౌకల్ని సిద్ధం చేసి ఉంచారు.
ఈ నౌకాదళ విస్తరణ హిందూ మహాసముద్రంలో భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే వ్యూహాత్మక అడుగు. ఒకే రోజున మూడు అద్భుతమైన స్వదేశీ యుద్ధనౌకలను ప్రవేశపెట్టడం ప్రధాని మోదీ సైనిక సన్నద్ధతకు నిదర్శనం. సరిహద్దుల్లో చైనాకు ముకుతాడు వేస్తూ, దేశ రక్షణకు భేద్యమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వానికి దేశమంతా జేజేలు పలుకుతోంది.



