………………………………………………………………………………………
ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా ఈవీఎమ్‌ల (EVM) పై నెపం తోసి వేయడం, వ్యవస్థలపై బురదజల్లడం కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా, తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి “ఈవీఎమ్లలో అవకతవకలు జరుగుతున్నాయి” అని ఏళ్ల తరబడి కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తూ వస్తోంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే తామే విజయం సాధిస్తామని, బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని కాంగ్రెస్ నాయకులు పదే పదే గొంతు చించుకుని వాదించారు.
అయితే, కాంగ్రెస్ ఆడుతున్న ఈ డ్రామాలను … నాలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పటాపంచలు చేశాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు కర్నాటకలోని 28 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి కూటమి భాారీ విజయాన్ని నమోదు చేసింది. కాంగ్రెస్ పార్టీ తాము డిమాండ్ చేస్తున్న విధంగానే పూర్తిగా బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే పోలింగ్ నిర్వహించారు. కానీ 4 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేక కాంగ్రెస్ క్లీన్ స్వీప్ కు గురైంది.
ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని, వారి అబద్ధపు ప్రచారాన్ని బయటపెట్టాయి. సొంతంగా కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా, బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో నాలుగుకి నాలుగు సీట్లను కోల్పోయి కాంగ్రెస్ సున్నా చుట్టింది. ఓటు బ్యాంకు రాజకీయాలు, నిష్ఫలమైన హామీలు తప్ప ప్రజాక్షేత్రంలో బలం లేదని బ్యాలెట్ బాక్సుల సాక్షిగా తేలిపోయింది. ప్రజాదరణ లేక ఓడిపోతున్నారే తప్ప, ఓటింగ్ యంత్రాల వల్ల కాదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.
కాంగ్రెస్ తీరుపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. “నాలుగు పెద్ద రాష్ట్రాల్లో 28 స్థానాలకు బ్యాలెట్ పేపర్ల పద్ధతిలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, మరి కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో చెప్పగలరా?” అని ప్రధాని సామాజిక మాధ్యమాల్లో ఎద్దేవా చేశారు. ప్రధాని వేసిన ఈ ఒక్క ప్రశ్నతో కాంగ్రెస్ పార్టీ నోళ్లు మూతపడ్డాయి. ఓటమికి బాధ్యత వహించకుండా రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేసే కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు చెంపపెట్టులా మారాయి.
ప్రజల నమ్మకాన్ని, అభివృద్ధి అజెండాను నమ్ముకున్న బీజేపీని ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఈవీఎమ్ అయినా, బ్యాలెట్ పేపర్ అయినా… ప్రజల మద్దతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికే ఉందనే సత్యం స్పష్టమైంది. శాశ్వత వైఫల్యాలకు వేరే కారణాలు వెతుక్కునే కాంగ్రెస్, ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారకపోతే రాజకీయంగా మరింత దిగజారిపోవడం ఖాయం.
ఈవీఎమ్‌ల పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ఆరోపణలు, బ్యాలెట్ పోరులో వారి ఘోర వైఫల్యంపై మీ అభిప్రాయం ఏమిటో తెలియజేయండి. ఈ వీడియో ను బంధుమిత్రులకు షేర్ చేయండి.



