…………………………………………………………………………………….
హిందూ మతాన్ని వీడి ఇతర మతాలలోకి మారే వ్యక్తులకు సంబంధించి సుప్రీం కోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. హిందూ మతం నుండి ముస్లిం లేదా క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన .. రిజర్వేషన్స్ ఆ మతాల్లోకి బదిలీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిడి చేసుకున్న వ్యక్తులకు బిసి లేదా ఎస్సీ వర్గాల కింద రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది.
….
ఈ కేసు వివాదం తమిళనాడుకు చెందిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి పిటిషన్తో ప్రారంభమైంది. 2015లో హిందూ మతాన్ని వీడి ఇస్లాంలోకి మారిన అతను, బిసి కుల ధ్రువీకరణ పత్రం కేటాయించాలని తహశీల్దార్ను కోరాడు. అయితే, అతడి దరఖాస్తును తహశీల్దార్ తిరస్కరించడంతో అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. మత మార్పిడి జరిగినప్పటికీ వారి మునుపటి సామాజిక వెనుకబాటుతనం పోదని, కాబట్టి రిజర్వేషన్లు అందించవచ్చని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. కానీ, మద్రాస్ హైకోర్టు ఆ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఇస్లాంలో కుల వ్యవస్థ లేదని, మత మార్పిడి ద్వారా బిసి హోదాను పొందేందుకు రాజ్యాంగపరంగా అవకాశం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
…
క్రైస్తవ, ముస్లిం మతాల్లో కుల వ్యత్యాసాలు లేవని ప్రచారం చేస్తూనే, మరోవైపు హిందూ మతంలో ఉన్నప్పుడు లభించే రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు పొందాలని చూసే మత మార్పిడుల తీరుకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. ఆశ చూపి లేదా ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు చేసే శక్తి వర్గాలకు ఇది కోలుకోలేని దెబ్బ. వేరే మతంలోకి మారితే చట్టబద్ధంగా సంక్రమించే హక్కులు, రిజర్వేషన్ ఫలాలు కోల్పోవాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం అత్యంత పారదర్శకంగా వివరించింది.
..
ఆశలకు, తాత్కాలిక ప్రలోభాలకు లొంగి హిందూ ధర్మాన్ని వీడుతున్నవారు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాల్సిన అవసరం ఉంది. అపోహలతోనో లేదా వ్యామోహంతోనో ఇతర మతాలను స్వీకరిస్తే బిసి, ఎస్సీ రిజర్వేషన్లతో పాటు చట్టబద్ధంగా లభించే అనేక ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుందని తెలుసుకోవాలి. క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన తర్వాత సామాజిక హోదా పెరగకపోగా, రాజ్యాంగపరంగా లభించే ఫలాలు సైతం అందవని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.



