…………….
జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ కొత్త స్టైల్ ఫాలో అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలపై బురద చల్లడం, ఆ తర్వాత న్యాయపరమైన ఇబ్బందులు రాగానే ఒక చిన్న క్షమాపణ చెప్పి తప్పించుకోవడం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అలవాటుగా మారింది. బీజేపీ నేతల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన నిరంతరం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఆపై కోర్టుల మెట్లు ఎక్కినప్పుడు మాట మార్చి ‘సారీ’ చెప్పి చేతులు దులుపుకోవడం ద్వారా ఆయన రాజకీయ నైతికతను పూర్తిగా పక్కనబెట్టేశారు.
……………..
గతంలోనూ రాహుల్ గాంధీ ఇలాంటి అనేక కుట్రపూరిత విమర్శలు చేసి కోర్టుల్లో క్షమాపణలు చెప్పారు.
.. (( గ్రాఫిక్స్ స్టార్ట్))..
‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్ డీల్ విషయంలో చేసిన నిరాధార వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుంది’ అంటూ ఓ సామాజిక వర్గం మీద బురద చల్లారు. ఆర్ఎస్ఎస్ సంస్థపై, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీపై, దివంగత నేత అరుణ్ జైట్లీపై కూడా ఆయన గతంలో ఇలాగే నిందలు వేశారు., ఆ తర్వాత కోర్టు కేసులకు భయపడి సారీ చెప్పి తప్పించుకున్నారు.
… (( గ్రాఫిక్స్ ఎండ్))..
తాజాగా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌ను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ మరోసారి తన పాత కుట్రను అమలు చేశారు. పనామా పేపర్స్ లీక్‌లో కార్తికేయ సింగ్ పేరు ఉందంటూ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా అబద్ధాలు ప్రచారం చేశారు. తన కుటుంబంపై బురద చల్లడాన్ని తీవ్రంగా పరిగణించిన కార్తికేయ సింగ్ చౌహాన్, రాహుల్ గాంధీపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో రాహుల్ గాంధీ చేసిన కుట్రపూరిత ఆరోపణలు మరోసారి న్యాయస్థానం ముందు నిలబడలేకపోయాయి.
…………
ఈ కేసు కోర్టు విచారణకు రాగానే, రాహుల్ గాంధీ ఎప్పటిలాగే తన పంథాను మార్చుకుని సింపుల్‌గా సారీ చెప్పేశారు. తాను పొరపాటున ఆ పేరును ప్రస్తావించానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించు. కుంటున్నానని కోర్టుకు తెలిపి కేసు నుండి బయటపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనలేక, ప్రత్యర్థి నేతలపై ఆరోపణలు చేయడం, తీరా కోర్టులు అక్షింతలు వేసేసరికి క్షమాపణలు చెప్పి తప్పించుకోవడం రాహుల్ గాంధీ నైజానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..



