………………..
విదేశీ పర్యటనల్లో తెలంగాణ పాలకులు… అక్కడ ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారా? , సనాతన ధర్మాన్ని నిరంతరం తక్కువ చేసి మాట్లాడే వ్యక్తులను .. ముఖ్యమంత్రి కలవడం ఎంతవరకు సమంజసం? భారత్‌లో ప్రజాస్వామ్యం క్షీణించిపోతోందంటూ విదేశాల్లో విష ప్రచారం చేసే ప్రొఫెసర్లను బహిరంగంగా సమర్థించడం కాంగ్రెస్ నాయకులకు తగునా? అసలు ఆక్స్ఫర్డ్ పర్యటనలో రేవంత్ రెడ్డి కలిసిన ఆ ఇద్దరు ప్రొఫెసర్లు ఎవరు,? .. వారి వెనుక ఉన్న వివాదాలేంటో ఇప్పుడు చూద్దాం!
…………………….
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల యూకే పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ను సందర్శించారు. అక్కడ ఆయన ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రొఫెసర్ మాయా ట్యూడర్ “భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది” అంటూ నిరంతరం భారత్‌పై, విషం చిమ్ముతూ వ్యాసాలు రాసే వ్యక్తి. అలాంటి విమర్శకురాలిని కలిసి, “ఆమె వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను” అని రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తోంది.
…..
మరొక వ్యక్తి ఫైసల్ దేవ్‌జీ. ఈయన హిందూత్వానికి, భారతీయ జాతీయవాదానికి వ్యతిరేకంగా అనేక పుస్తకాలు, పత్రాలు రాశారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారత దేశం పరువు తీసేయటంలో ముందు నిలుస్తారు.
………………………
, భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే ఇటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రి కలవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విదేశాల్లో మన దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే వ్యక్తులతో కాంగ్రెస్ నేతలు నిరంతరం సంబంధాలు ఏమిటి ..అని దేశభక్తులు నిలదీస్తున్నారు.
మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తున్న వ్యక్తులను కలిసి, వారి వ్యాఖ్యలకు మద్దతు పలకడాన్ని భారత సమాజం తీవ్రంగా ఆలోచించాలి. రాజకీయ లబ్ధి కోసం, జాతీయ ప్రయోజనాలను పక్కనపెట్టడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం., దేశ ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే శక్తులతో చెయ్యి కలపడం ఎంతవరకు సమంజసమో ప్రజలు గ్రహించాలి. విద్యాభివృద్ధి పేరుతో జరుగుతున్న ఈ రకమైన రాజకీయ భేటీలను దేశ ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి, అమెరికా లో కూడా ఇలాంటి మీటింగ్ లు పెట్టుకొన్నందుకే.. విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది.
………….
ఈ వివాదాస్పద భేటీపై లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. భారతీయ జాతీయవాదాన్ని నిరంతరం గొంతెత్తి వినిపిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా యూట్యూబ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు, ఈ విశ్లేషణాత్మక వీడియోను మీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.



