ఒక నిండు కుటుంబం.. ఇద్దరు చిన్న పిల్లలతో ఎంతో సంతోషంగా సాగుతున్న ఆ సంసారంలో రైలు పట్టాలే ఎందుకు అంతిమ గమ్యస్థానమయ్యాయి? అసలు ఆ దంపతులు అంతటి ఘోరమైన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న ఆ పైశాచిక శక్తులు ఎవరు? కేవలం నమ్మిన మతం మారలేదన్న ఒకే ఒక్క కారణంతో, ఒక కుటుంబం మొత్తాన్ని మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పురికొల్పింది ఎవరు? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీషల మృతి వెనుక దాగున్న ఆ విస్తుపోయే నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
….
హైదరాబాద్ సిటీ పరిధిలోని ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో జూలై 2న రవికుమార్, శిరీష దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. బియ్యం వ్యాపారం చేసుకుంటూ, సొంత ఇల్లు కొనుక్కుని, ఇద్దరు కుమారులు సుశాంత్, విద్వాన్స్లతో ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలోకి పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులు మత మార్పిడి పేరుతో చిచ్చు పెట్టారు. రవికుమార్ ఇంటికి వచ్చిన ప్రతీసారి మతం మార్చుకొని ప్రతీ ఆదివారం చర్చికి రావాలని వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసేవారు. మృదు స్వభావి అయిన రవికుమార్ పక్కింటి వారి మాట కాదనలేక అప్పుడప్పుడు ప్రార్థనలకు వెళ్లినా, పూర్తిగా మతం మారడం తనకు ఇష్టం లేదని భార్య శిరీష తెగేసి చెప్పింది. దీంతో ఆ దంపతుల మధ్య కూడా తరచూ వివాదాలు రేగేలా పక్కింటి వాళ్లు కుట్రలు చేశారు.
….
ఎలాగైనా వారిని తమ మతంలోకి మార్చాలనే ప్లాన్‌తో, వారు మారడం లేదని గ్రహించిన వెంకట్, ప్రమీలలు ఒక క్రూరమైన వ్యూహం పన్నారు. రెడీమిక్స్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే నెలకు 20 వేల రూపాయల ఆదాయం వస్తుందని నమ్మించి, రవికుమార్ భార్య నగలను తాకట్టు పెట్టించి 20 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఆ తర్వాత రెండు, మూడు నెలలు మాత్రమే డబ్బులు ఇచ్చి ఆపేయడంతో, బ్యాంకులో ఉన్న బంగారానికి వడ్డీలు కట్టలేక ఆ దంపతులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పక్కింటి దంపతుల వేధింపులు భరించలేక సొంత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని సామాన్లు కూడా సర్దుకున్నారు. కానీ జూలై 2 సాయంత్రం ఆత్మహత్యకు ముందు పక్కింటి వెంకట్‌తో రవికుమార్ సుమారు అరగంట సేపు ఫోన్లో మాట్లాడినట్లు, ఆ తర్వాతే మనస్తాపంతో దంపతులిద్దరూ రైలు కింద పడి తనువు చాలించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
…..
ఈ ఘోర ఉదంతం మన సమాజంలో మత మార్పిడి శక్తులు ఎంతటి క్రూరత్వానికి ఒడిగడుతున్నాయో స్పష్టం చేస్తోంది. అమాయకత్వాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి శక్తుల పట్ల ప్రజలారా, మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలు చూపి, మానసికంగా వేధిస్తూ మత మార్పిడులకు ఒత్తిడి తెచ్చే వారి పట్ల జాగ్రత్త వహించండి. ఎవరైనా మిమ్మల్ని లేదా మీ చుట్టుపక్కల వారిని ఇలా ఇబ్బంది పెడుతుంటే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ప్రాణాలు తీసుకోవడం దేనికి పరిష్కారం కాదు, చట్టబద్ధంగా పోరాడి ఇలాంటి పైశాచిక శక్తుల ఆటకట్టించాలి.
……
సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలను ఎండగడుతూ, ధర్మ రక్షణే ధ్యేయంగా జాతీయ వాదాన్ని మీ ముందుకు అందిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ ఛానల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి. జై హింద్.



