నమస్కారం మై ఇండియా మీడియా వీక్షకులకు స్వాగతం.
మన పిల్లలను చదివించడానికి స్కూళ్లకు పంపుతున్నారా… లేక వారి లేత మనసుల్లో మతపరమైన ఆలోచనలను నూరిపోసే కేంద్రాలకు పంపుతున్నారా? హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్ చేసిన నిర్వాకం చూశాకైనా మన కళ్లు తెరుచుకుంటాయాలేదా?
కేవలం రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థుల డైరీల్లో ‘కల్మా’, ‘సూరా ఫాతిహా’లను హోమ్ వర్క్ లు గా రాసి పంపించారు.. వీటిని కంఠస్తం చేయాలని ప్రైవేటు స్కూల్స్ ఆదేశిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ మాదన్న పేటలోని సక్సెస్ స్కూల్ లో దారుణం జరిగింది. రెండో తరగతి పిల్లలకు కల్మా మీద టీచర్ హోమ్ వర్క్ ఇచ్చారు. దీనిని కంఠస్తం చేసుకొని రావాలని ఆదేశించారు. ఈ అరాచకాన్ని హోం వర్క్ డైరీల్లో గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ ఆవరణలోనే తల్లిదండ్రులకు, యాజమాన్యానికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లౌకికవాదం, విద్యా విధానం అని రంగురంగుల బోర్డులు తగిలించే ఇలాంటి ప్రైవేట్ స్కూళ్లు… లోపల మాత్రం విద్యార్థులపై మతమార్పిడి ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్షరాలు సరిగ్గా రాని వయసులో, పసి పిల్లల డైరీల్లో ఇలాంటి మతపరమైన ప్రార్థనలను రాయమనడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో విద్యాశాఖ తక్షణమే తేల్చాలి.
…………
ఈ ఘటనపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని తల్లిదండ్రులు మరియు జాతీయవాద సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన స్కూళ్లు మత ప్రచార కేంద్రాలుగా మారితే సమాజంలో ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? హిందూ పండుగలు వస్తే క్రాకర్స్ కాల్చొద్దు, రంగులు పూసుకోవద్దు అని క్లాసులు పీకే ఇలాంటి స్కూళ్లు… క్లాస్ 2 పిల్లలకు ఇతర మత ప్రార్థనలను ఎలా అలవాటు చేస్తాయి? ఇది హిందూ ధర్మంపై, మన సంస్కృతిపై విద్యా వ్యవస్థ ద్వారా జరుగుతున్న దాడి ఇది
……………………………………………
మిత్రులారా… సైదాబాద్ స్కూల్లో తల్లిదండ్రులు ధైర్యంగా నిలదీశారు కాబట్టి ఈ కుట్ర బయటపడింది; కానీ మీ పిల్లల స్కూళ్లలో ఇలాంటివి జరగట్లేదని గ్యారెంటీ ఏంటి? ఇకనైనా ప్రతి హిందూ తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి, మీ పిల్లల హోం వర్క్ డైరీలను ప్రతిరోజూ గమనించాలి. మన పిల్లలకు మన సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని ఇంట్లోనే నేర్పిస్తూ, ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల ఆటలు సాగకుండా మనమంతా గళమెత్తాలి. విద్యా వ్యవస్థలో జరుగుతున్న ఈ మతపరమైన దాడులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.
…………….
భారతీయ సంస్కృతిని కాపాడుతూ, మన దేశంలో జరుగుతున్న ఇలాంటి విద్యా కుట్రలను, సత్యాలను నిర్భయంగా మీ ముందుకు తెస్తున్న మీ ‘మై ఇండియా మీడియా’ ఛానెల్‌ను ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి చేరవేసేలా ఈ వీడియోను లైక్ చేసి, వెంటనే షేర్ చేయండి. ధన్యవాదాలు, జై హింద్, జై భారత్!




