
………………………………………………………………………………………………………….
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా కోసం కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనల వెనుక స్వార్థం కనిపిస్తోంది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే ఎన్నికల కమీషన్‌ను లక్ష్యంగా చేసుకుని గందరగోళం చేస్తున్నాయి. ప్రపంచ దేశాలలో భారత్ పరువు తీసేసేందుకు, గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
తాజాగా, ఆందోళనల పేరుతో రాజధానిలో గందరగోళం సృష్టించేందుకు సీజేపీ ప్రయత్నించగా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. విమానంలో ఢిల్లీకి వస్తున్న సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కేను విమానం లోపలే పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెర వెనుక కుట్రలు చేస్తున్న ధ్రువ్ రాఠే ను హౌస్ అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు అనుమతి లేకపోయినా నిరసనలకు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
ఆందోళనలకు అనుమతి నిరాకరించడానికి ఢిల్లీ పోలీసులు స్పష్టమైన కారణాలను వెల్లడించారు. గత నిరసనలలో ఇచ్చిన హామీలను, నిబంధనలను సీజేపీ తీవ్రంగా ఉల్లంఘించింది. అడ్డగోలుగా ఆందోళనలకు దిగింది. అలాగే జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాల్సి ఉండగా, కేవలం 3 రోజుల ముందే దరఖాస్తు చేశారు. దీంతో దరఖాస్తు ని తిరస్కరించారు.
అనుమతి లేకున్నా రోడ్లపైకి రావడం కాంగ్రెస్, సీజేపీలకు అలవాటుగా మారింది. ఆందోళనల కారణంగా ఢిల్లీలో 57 మెట్రో స్టేషన్లు మూసివేయాల్సి వచ్చింది. 250కి పైగా రైళ్లు రద్దు అయ్యాయి. సెంట్రల్ ఢిల్లీ పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మద్యం షాపులు బంద్ చేశారు. ప్రజలకు నగరంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు 20 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ వద్ద 7 అంచెల బారికేడ్లు, 300కు పైగా సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు. పింక్ ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించారు. గతంలో ఉల్లంఘనలకు పాల్పడిన హిస్టరీ ఉన్నందుకే పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టాల్సి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన వేదికల ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ కాంగ్రెస్, సీజేపీలు చట్టాలను, పోలీసు ఆదేశాలను తుంగలో తొక్కి ఢిల్లీని అష్టదిగ్బంధనం చేయడానికి తెగబడ్డాయి. సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, రాజ్యాంగ సంస్థలపై ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ రెండు పార్టీల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



