తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీతా స్వర్ణలింగం త్వరలోనే భారతీయ జనతా పార్టీ లో చేరబోతున్నారనే వార్త సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాడులో బిజెపి మరింత శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఇది ఒక గొప్ప మైలురాయి కానుంది. జాతీయవాద భావజాలంతో ఆమె బిజెపిలో చేరితే రాష్ట్రంలో పార్టీ కేడర్‌లో సరికొత్త జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
సంగీత లండన్‌లో స్థిరపడిన శ్రీలంక ప్రముఖ వ్యాపారవేత్త స్వర్ణలింగం కుమార్తె. ఆమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ప్రజల నాడి పూర్తిగా తెలిసిన నిఖార్సైన రాజకీయ వ్యూహకర్త కూడా. చాలా కాలంగా విజయ్ వెనుక ఉండి సోషల్ మీడియాలో ఆయనకు బలమైన బ్రాండింగ్ కల్పించింది సంగీత నే. గత పది ఏళ్లుగా ఆమె అహర్నిశలూ చేసిన అద్భుతమైన కృషితోనే విజయ్‌కు యువతలో ఈ స్థాయి క్రేజ్ మరియు తిరుగులేని పేరు వచ్చింది. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతి ఆమెను ఎంతగానో ఆకర్షించిందని సమాచారం. మహిళా సాధికారతకు మరియు అవినీతి రహిత పాలనకు బిజెపి ఇస్తున్న ప్రాధాన్యతను ఆమె మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. జాతీయ దృక్పథం ఉన్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని ఆమె బలంగా భావిస్తున్నారు.
వాస్తవానికి విజయ్ ను బిజెపికి దగ్గర చేయాలని ఆమె భావించినప్పటికీ, కొన్ని దుష్టశక్తులు విజయను కాంగ్రెస్ భావజాలం వైపు నడిపించాయి. విభేదాలకు ఇది కూడా కారణం అంటున్నారు.
తమిళనాడులో మరింతగా విస్తరించాలని చూస్తున్న బిజెపికి సంగీత లాంటి మేధావి, వ్యూహకర్త అయిన మహిళా నాయకురాలి రాక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. సంగీతకున్న సాఫ్ట్ ఇమేజ్ మరియు ఆమె వ్యూహాత్మక చతురత తమిళనాడులోని యువతను, మహిళా ఓటర్లను బిజెపి వైపు తిప్పడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతర్జాతీయ అవగాహన ఉన్న అంత్యంత ప్రతిభావంతురాలిగా ఆమె బిజెపి జాతీయ విధానాలను తమిళ ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలరు. తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి మరియు మహిళా నాయకత్వానికి బిజెపి వేదిక కాబోతోందనడానికి ఈ పరిణామాలు ఒక నిదర్శనం. అధికారిక ప్రకటన వస్తే గనుక దక్షిణాది రాజకీయాల్లో కమలం పువ్వు మరింత వికసించడం ఖాయం.




