…………………………………………………….
నమస్తే, కొద్ది రోజులుగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అండమాన్ ప్రాజెక్టు మీద ఉద్యమం నిర్మిస్తున్నారు. దీని వెనుక ఎంతటి కుట్ర దాగి ఉందో మీకు తెలుసా… ? మన దేశ రక్షణను పటిష్టం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? చైనా నేరుగా అడగలేని మాటలను, కాంగ్రెస్ నోటి ద్వారా చెప్పిస్తోందా? గ్రేట్ నికోబార్ దీవుల్లో జరుగుతున్న 92 వేల కోట్ల భారీ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాహుల్ గాంధీ ఎందుకు తాపత్రయపడుతున్నారు? విదేశీ నిధులతో మన దేశ అభివృద్ధిని, సైనిక ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఆ శక్తుల వెనుక ఉన్న అసలు కుట్రను ఇప్పుడు బట్టబయలు చేద్దాం.”
…………………………………………………..
“గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ చైనా పాలిట సింహస్వప్నంగా మారింది. అక్కడ భారీ నౌకాశ్రయ కేంద్రం, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ సముద్ర మార్గం నుంచే చైనాకు అవసరమైన 80 శాతం ఇంధనం సరఫరా అవుతుంది. అక్కడ భారత్ నౌకాశ్రయం నిర్మిస్తే, చైనా రాకపోకల మీద నిఘా వేయవచ్చు. అప్పుడు చైనా సంగతులు మనకు బాగా తెలిసిపోతాయి. హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని దెబ్బతీస్తూ, భారత సైనిక ఆధిపత్యాన్ని పెంచే వ్యూహాత్మక ప్రాజెక్ట్ ఇది. అందుకే చైనా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం తెలివిగా కాంగ్రెస్ పార్టీని ముందకు నెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు పర్యావరణం పేరుతో కొత్త రాగాలు అందుకొన్నారు. ఇప్పటికే,, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును ఆలస్యం చేశారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీరి వాదనలను తిప్పికొట్టి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.”
…………………………………………..
“అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడం కాంగ్రెస్కు మొదటి నుంచీ అలవాటే. గతంలో గుజరాత్లో నర్మదా నది ప్రాజెక్టును కూడా ఇలాగే అడ్డుకోవాలని చూశారు. 2001లో గుజరాత్ కరవుతో అల్లాడుతున్నా కరగలేదు. కానీ నరేంద్ర మోదీ పట్టుదలతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీరు అందించారు. కూడంకుళం, విజింజం, స్టెరిలైట్ ప్రాజెక్టులను కూడా నాశనం చేయడానికి ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. ఇప్పుడు గ్రేటర్ నికోబర్ ప్రాజెక్టు మీద కన్నేశారు. దేశ ప్రయోజనాలను పక్కనబెట్టి చైనా కనుసన్నల్లో నడుస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక గిరిజన కౌన్సిల్ 2022లోనే ఎన్ఓసీ ఇచ్చినా, రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లి గిరిజనులను రెచ్చగొట్టడం అత్యంత సిగ్గుచేటు.”
…………………………………………………..
“కానీ కాంగ్రెస్, చైనాల కుట్రలు సాగే రోజులు పోయాయి. ఎందుకంటే ఇప్పుడు దేశాన్ని నడిపిస్తోంది నరేంద్ర మోదీ. దేశ రక్షణ, ప్రగతి విషయంలో మోదీ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. విదేశీ నిధులు తింటూ మన దేశాన్ని దెబ్బతీయాలని చూసే అరాచక శక్తుల పప్పులు ఇక్కడ ఉడకవు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును దేశం ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతుంది. చైనాకు బుద్ధి చెప్పి తీరుతుంది.”
……………………………………..
“మిత్రులారా.., దేశ భద్రతకు, జాతీయవాదానికి అండగా నిలుస్తూ నిజమైన వాస్తవాలను మీకు అందిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా కుట్రలను బట్టబయలు చేసే ఈ వీడియోను దేశభక్తులందరికీ తప్పకుండా షేర్ చేయండి. జై హింద్!”




