“మన దేశ యువతను దారి మళ్లించేందుకు భారీ కుట్ర జరుగుతోందని తెలుసా… ఆ విదేశీ కుట్ర వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ఈ అరాచకం వెనుక ఎవరి హస్తం ఉంది? ‘జన్ జీ యాజిటేషన్’ అంటూ ఉన్నట్టుండి దేశవ్యాప్తంగా ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారు? దీని కోసం సోషల్ మీడియాలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రెండింగ్స్ చేయిస్తున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇంత భారీ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తోంది? విదేశాల నుండి ఈ నెట్వర్క్ను ఎందుకు ఆపరేట్ చేస్తున్నారు? యువతను తప్పుదారి పట్టించడానికి సాగుతున్న ఈ డిజిటల్ కుట్రలోని నిజాలను ఇప్పుడు బట్టబయలు చేద్దాం.”
………………………………………………………….
“దేశంలో అశాంతిని రేపడమే ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వెనుక ఉన్న అసలు వ్యూహం. దీని కోసం విదేశీ నిధులు నీళ్లలా ప్రవహిస్తున్నాయి. భారత వ్యతిరేక శక్తులు తెర వెనుక ఉండి ఈ కుట్రను నడిపిస్తున్నాయి. ‘జన్ జీ యాజిటేషన్’ అనే ఒక ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. రాత్రికి రాత్రే కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మన దేశ యువత ఆలోచనలను విషపూరితం చేయడమే వీరి ప్రధాన లక్ష్యం. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారతదేశాన్ని అడ్డుకోవడానికి విదేశీ గడ్డలపై ఈ వ్యూహాలు పన్నారు.”
…………………………………..
“అయితే, ఈ కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగానే చూస్తోంది. అందుకే మొన్న ఢిల్లీలో వారు చేసిన ఆందోళనలకు కూడా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇచ్చింది. కానీ ఇక్కడే ఒక పెద్ద విచిత్రం, ఒక భారీ కుట్ర బయటపడింది. ఆ ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు 4, 5 వందల మందికి మించి లేరు. కానీ, ఆశ్చర్యకరంగా ఆ చిన్న నిరసనను కవర్ చేయడానికి సోషల్ మీడియా ప్రతినిధులు 2 వేల మందికి పైగా తరలివచ్చారు! జనం కంటే కెమెరాలే ఎక్కువ ఉన్న ఈ హైప్ వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటి? గ్రౌండ్ లెవెల్లో లేని మద్దతును డిజిటల్ మీడియా ద్వారా ఉన్నట్లుగా చూపించే ఈ భారీ డ్రామా వెనుక ఎవరి హస్తం ఉంది?”
………………………………
అందుచేత ఈ కుట్ర ను మనం అర్థం చేసుకోవాలి. విదేశీ నిధులతో, పెయిడ్ సోషల్ మీడియా ఆర్మీలతో నడిచే ఇలాంటి డ్రామాలను, ట్రాప్లను యువత అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ట్రెండ్ వెనుక, ప్రతి లైవ్ కవరేజ్ వెనుక ఉన్న నిజానిజాలను గమనించాలి. దేశాన్ని బలహీనపరచాలని చూసే శక్తుల పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ డిజిటల్ కుట్రను తిప్పికొట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత.”
“ప్రజలారా, మన దేశ భద్రతను, జాతీయవాదాన్ని కాపాడుకోవడానికి నిజమైన వాస్తవాలను అందిస్తున్న ‘మై ఇండ్ మీడియా’ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. యువతను అలర్ట్ చేసేలా ఈ వీడియోను అందరికీ తప్పకుండా షేర్ చేయండి. జై హింద్!”



