“దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ కనబడటం లేదంటూ పోస్టర్లు వెలిశాయి . దీని వెనుక ఉన్న అసలు రాజకీయ రహస్యం ఏమిటి? కీలక సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత దేశం విడిచి ఎక్కడికి వెళ్లారు? ప్రజా సమస్యలపై పోరాడతామని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీ, తీరా సమయం వచ్చేసరికి బాధ్యతలను విస్మరించి విదేశాలకు ఎందుకు చెక్కేస్తారు? రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయాలను ఎండగడుతూ ఢిల్లీ వ్యాప్తంగా వెలసిన ఈ పోస్టర్ల వెనుక ఉన్న సంచలన నిజాన్ని ఇప్పుడు చూద్దాం.”
…………..
“ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం సహా పలు కీలక ప్రాంతాలలో రాహుల్ గాంధీ మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశంలో ప్రజా సమస్యలపై తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడల్లా … రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. విద్యార్థులతో భారీ ఉద్యమం నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారు. విద్యార్థులు రోడ్ల మీద కు వచ్చేశాక … రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా పదే పదే విదేశాలకు వెళ్లడంపై ఢిల్లీ ప్రజలు ఈ పోస్టర్ల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు.”
………
“ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ రాజకీయ వైఖరిని నెటిజన్లు తీవ్రంగా ఎండగట్టారు. సాధారణంగా దేశంలో ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ ప్రజల్లోకి వస్తారని, ఎన్నికలు ముగియగానే లేదా పార్లమెంట్ సభలు ప్రారంభం కాగానే విదేశీ విహారయాత్రలకు వెళ్ళిపోతారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పోస్టర్ల వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆత్మరక్షణలో పడింది. సొంత నేత సమాధానం చెప్పుకోలేక విదేశాల్లో ఉంటే, ఇక్కడ పార్టీ శ్రేణులు మాత్రం ఈ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేత పాత్ర అత్యంత కీలకమైనదని, దాన్ని రాహుల్ గాంధీ నిర్లక్ష్యం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.”
…….
“రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల ప్రచారం, మైకుల ముందు ఉపన్యాసాలు దంచడం మాత్రమే కాదు… సభలో ఉండి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. కానీ రాహుల్ గాంధీ వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. దేశంలో ఎప్పుడు ఏదైనా సమస్య వస్తే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టేసి విదేశాలకు వెళ్ళిపోవడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఈ రకమైన నాన్-సీరియస్ రాజకీయాలను దేశ యువత మరియు సామాన్య ప్రజలు ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఢిల్లీ వీధుల్లో వెలసిన ఈ పోస్టర్లు రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతకు మరియు బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతున్నాయి.”
…………
“ప్రజలు తమ సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తారని నమ్మి ప్రతిపక్ష హోదాను ఇస్తే, సభను వదిలి విదేశాల్లో గడపడం ప్రజాతీర్పును అవమానించడమే అవుతుంది. రాహుల్ గాంధీ ఇకనైనా ఈ పార్ట్ టైమ్ రాజకీయ స్వభావాన్ని మార్చుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దేశ రాజకీయాల నుంచే పూర్తిగా మిస్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి.”
………
“ప్రజలారా, దేశంలోని ఇలాంటి నగ్న రాజకీయ సత్యాలను బట్టబయలు చేస్తూ, జాతీయవాదాన్ని మీకు అందిస్తున్న మీ ‘మై ఇండ్… మీడియా’ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ గాంధీ రాజకీయ తీరును ఎండగట్టే ఈ సంచలన విశ్లేషణను ప్రతి ఒక్కరికీ చేరేలా ఇప్పుడే షేర్ చేయండి. జై హింద్!”




