జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ లో భాగంగా నారాయణపేట జిల్లా వ్యవసాయశాఖ అధ్వర్యంలో, గ్రామభారతి & సత్యదర్శనం ఫౌండేషన్ ల సహకారంతో పూర్ణిమ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం వుంటుందని,FPO ఏర్పాటుకు మరియు జిల్లాలో శాశ్వత శిక్షణా కేంద్ర ఏర్పాటుకు సహకరిస్తానని, రైతులందరూ నేల ఆరోగ్యం కాపాడుకోవాలని తెలపడం జరిగింది.
పూర్ణిమ క్షేత్ర యజమాని Dr. జనార్ధన్ మనమందరం పోషక విలువలున్న ఆహారం పండించుకుందామని, రమాదేవి దేశీ విత్తనాన్ని&గోమాతను సంరక్షించుకోవాలని, DM&HO.& గ్రామభారతి జిల్లా గౌరవ అధ్యక్షులు Dr. జయచంద్ర మోహన్ మన ప్రాణాలను కాపాడు కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఆహారాన్ని తినాలని, DH&SO సాయిబాబ ప్రకృతి వ్యవసాయంలో కూడా కూరగాయలు,పండ్లు పండించు కోవచ్చని, గ్రామభారతి జిల్లా అధ్యక్షులు శివ కుమార్ మనం తినే తిండిని బట్టి మన ఆలోచన విధానం వుంటుంది కాబట్టి తినే తిండిని సరిచేసుకోవాలని, సత్యదర్శనం ఫౌండేషన్ ఫౌండర్& గ్రామభారతి జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రకృతి విరుద్ధంగా మనం చేసే చర్యలు ఇలాగే కొనసాగితే మానవ మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ప్రకృతి వ్యవసాయ శిక్షకులు ఉపేందర్ శాస్త్రీయ ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తే యువత ప్రకృతి వ్యవసాయంలో నిలదొక్కుకోవచ్చని మరియు కషాయాల &ద్రావణాల గురించి తెలపగా,కోస్గి ADA రామకృష్ణ భూమిలో సేంద్రీయ పదార్థాన్ని పెంచుకుంటే దిగుబడులు పెరుగుతాయని, మాగనూరు MAO సుదర్శన్ కృత్రిమ రసాయనాలు అధికంగా వాడితే భూమి నిస్సారం అవుతుందని, ముకుందా రెడ్డి గారు దేశీ గోవులను సంరక్షించుకోవాలని తెలిపారు .
రఘోత్తమాచార్యులు ప్రపంచం ప్లాస్టిక్ మాయం అయిందని,దీనికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని, రాజమల్లేశం యువత తమ శక్తిని తాము తెలుసుకుని బాలకృష్ణల స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకు సాగాలని, కావలి వెంకటేష్ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు ఆలోచించాలని, జ్ఞానేశ్వర్ రెడ్డి ప్రకృతి సిద్ధంగా ఎరువులను తయారు చేసుకుని వాడాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనార్ధన్ గారు,రమాదేవి గారు,జాన్ సుధాకర్ ,జ యచంద్ర మోహన్,శివ కుమార్, సాయిబాబ, నగేష్,రామకృష్ణ , సుదర్శన్, క్లస్టర్ AO&AEO, శ్రీ రఘోత్తమాచార్యులు,ముకుందా రెడ్డి , రాజ మల్లేశం ,వెంకటేష్ , శశిధర్ ,రజిత ,జ్ఞానేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి ,రవి,శివ ,ఉపేందర్,బాలకృష్ణా రెడ్డి , నరేష్ , స్రవంతి, ఉమ ,పద్మజ, పరిమళ ,కృషి సఖీలు మరియు 400 మంది రైతులు పాల్గొన్నారు.



