అమిత్ షా స్కెచ్.. మమత కు షాక్.. తృణమూల్ ఎంపీల కొత్త బాట..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం చోటుచేసుకుంది. టీఎంసీ లోక్సభ ఎంపీల ఒంటెద్దు పోకడలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన 20 మంది ఎంపీలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా మాస్టర్ ప్లాన్ అమలు చేశారు. వీరంతా న్యూఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనమయ్యారు. కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
………
ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా చాణక్య రాజనీతి, అద్భుత వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిరుగుబాటు ఎంపీలను నేరుగా బీజేపీలో చేర్చుకోకుండా మరో ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం అమిత్ షా ముందస్తు ఆలోచనకు నిదర్శనం. దీనివల్ల ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి ఎంపీలకు పూర్తిగా విముక్తి లభించింది. టీఎంసీ మొత్తం బలంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది ఉండటంతో వారిపై ఎలాంటి అనర్హత వేటు పడదు. సుప్రీంకోర్టు చుట్టూ తిరిగే సుదీర్ఘ చట్టపరమైన తలనొప్పులను అమిత్ షా తన మార్కు రాజకీయంతో ముందే ఊహించి తప్పించారు.
…
ఈ మాస్టర్ స్ట్రోక్ వల్ల స్థానిక బీజేపీ కేడర్ నుంచి వచ్చే వ్యతిరేకత కూడా పూర్తిగా తగ్గిపోయింది. మమతా బెనర్జీ ఎంపీలను నేరుగా పార్టీలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులను అమిత్ షా ఇలా చాకచక్యంగా అధిగమించారు. మిత్రపక్షంగా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన మార్గాన్ని చూపించారు. ఈ వ్యూహాత్మక అడుగుతో లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం 313 స్థానాలు దాటి మరింత పటిష్ఠంగా మారింది. ఇందులో బీజేపీ సొంత సీట్లు 240 కాగా కొత్తగా చేరిన ఎంపీల మద్దతు కూటమికి మరింత ఊపునిచ్చింది.
…..
మరోవైపు బెంగాల్ అసెంబ్లీలోనూ మమతా బెనర్జీకి పెద్ద షాక్ తగిలింది. అక్కడ కూడా 64 మందికి పైగా టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు చేసి వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రస్తుతానికి వీరిని స్పీకర్ విపక్ష హోదాలోనే గుర్తించారు. రాజకీయంగా, చట్టపరంగా అందరికంటే నాలుగు అడుగులు ముందే ఉంటూ అమిత్ షా అడుగులు వేశారు. మమతా బెనర్జీ రాజకీయ కోట కుప్పకూలడానికి ఈ వ్యూహాత్మక ప్రణాళికే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.




