………………………………………………
అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ఎప్పుడూ తెరవెనుక నక్కజిత్తుల రాజకీయాలే చేస్తుంది. గతంలో పాకిస్థాన్‌ను “అబద్ధాల కోరు, మోసకారి” అని తిట్టిన డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు హఠాత్తుగా ఆ దేశాన్ని, వారి సైనికాధ్యక్షుడు అసిమ్ మునీర్‌ను తెగ పొగిడేస్తున్నారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన ఒక దేశాన్ని అమెరికా నాయకత్వం అకస్మాత్తుగా మిత్రదేశంగా మార్చేయడం వెనుక ఒక భారీ ఆర్థిక రహస్యం దాగి ఉందనే నిజం ఇప్పుడు అధికారిక లెక్కలతో సహా బయటపడింది.
………………
ఈ నాటకీయ మార్పు వెనుక ఉన్న అసలు రహస్యం ట్రంప్ కుటుంబానికి చెందిన క్రిప్టో కరెన్సీ వ్యాపారం. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఆర్థిక నివేదికల ప్రకారం, 2025లో ట్రంప్ క్రిప్టో వ్యాపారాల ద్వారా ఏకంగా 11 వేల కోట్ల రూపాయలకు పైగా భారీ రాబడిని ఆర్జించారు. ఇందులో ట్రంప్ కుమారులు నడిపే ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ సంస్థ ద్వారానే సుమారు 7 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సొంత దేశ ప్రజలు తిండిలేక, అప్పుల్లో మునిగి ఆకలితో అలమటిస్తుంటే, పాక్ సైనికాధ్యక్షుడు మునీర్ మాత్రం ట్రంప్ కుటుంబ క్రిప్టో బిజినెస్‌లో తమ దేశం డబ్బులన్నీ తీసుకెళ్లి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అంటే పాకిస్థాన్ ప్రజల ఉసురు పోసుకొంటూ, మున్నీర్ అండ్ గ్యాంగ్ విలాసాలు చేస్తున్నారన్న మాట.
…………………………
పైగా ట్రంప్ సంస్థకు చెందిన ‘USD1’ అనే స్టేబుల్ కాయిన్‌ను తాము ఉపయోగించేలా ఒక ఒప్పందం పై పాకిస్తాన్ సంతకాలు చేసేసింది.
ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఒప్పంద వేడుకలో స్వయంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనికాధ్యక్షుడు అసిమ్ మునీర్ హాజరవడం గమనార్హం. అంటే, పాక్ ప్రజల సొమ్మును, దేశ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ క్రిప్టో సామ్రాజ్యానికి లాభాలు చేకూర్చేలా తాకట్టు పెట్టారన్నమాట. రానున్న కాలంలో పాకిస్థాన్ ప్రజల భవిష్యత్ ను ట్రంప్ ఆర్ఠిక సంస్థల్లో బందీ అయిపోయినట్లే. అందుచేతనే మునీర్ నాయకత్వాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
…………………………….
ఇలాంటి వ్యక్తిగత ఆర్థిక బంధాలు, పెట్టుబడుల వల్లే అమెరికా నాయకత్వం పాకిస్థాన్‌ను మిత్రదేశంగా చూపిస్తూ కప్పిపుచ్చుతోంది. పాక్ పాలకుల నల్లధనం, అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి అమెరికా అగ్రనేత కుటుంబాన్ని ఈ క్రిప్టో నెట్వర్క్ ద్వారా ప్రసన్నం చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఎంత డ్రామా ఆడినా, క్రిప్టో కరెన్సీ ముసుగులో పాకిస్థాన్ చేస్తున్న ఈ సరికొత్త అవినీతి మాయాజాలం ఇప్పుడు ఇప్పుడే తెలిసి వస్తోంది.



