……………
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత, ఆర్థిక ప్రగతి, డిజిటల్ విప్లవంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతోంది. సరిహద్దుల రక్షణ మొదలుకొని స్వదేశీ పరిశ్రమల అభివృద్ధి వరకు ప్రతి విషయంలోనూ జాతీయవాదమే పునాదిగా కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతోంది.
………………….
కానీ, దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం ఇష్టం లేని కొన్ని శక్తులు సోషల్ మీడియా వేదికగా యువతను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే “కాక్రోచ్ జనతా పార్టీ” అనే పేరుతో సరికొత్త డిజిటల్ అరాచకానికి తెరలేపాయి. యువతలో ఉన్న అసంతృప్తిని, ఆవేశాన్ని క్యాష్ చేసుకుంటూ కేవలం కొన్ని రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను ఈ నెట్వర్క్ పోగుచేసింది. పొలిటికల్ సెటైర్ అనే ముసుగు వేసుకుని ఈ శక్తులు.. దేశ ప్రగతిని కించపరిచేలా నిరంతరం మీమ్స్, రీల్స్ ప్రచారం చేస్తున్నాయి.
………..
ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఆన్లైన్ ఫన్ కోసం పెట్టిన వేదిక కాదు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ సంస్థలను, చివరకు న్యాయవ్యవస్థను సైతం టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. నీట్ , సీబీఎస్ఈ పరీక్షల అంశాలను ఆసరాగా చేసుకుని విద్యార్థుల్లో పరీక్షల వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు కీలక నాయకులు మరియు వామపక్ష శక్తులు ఈ అజ్ఞాత గ్రూపులకు వెనుక ఉండి మద్దతు ఇవ్వడం దీని వెనుక ఉన్న రాజకీయ కుట్రను స్పష్టం చేస్తోంది. మొబైల్ స్క్రీన్ల ద్వారా విప్లవం తెస్తామంటూ దేశ యువశక్తిని సోమరులుగా, వ్యవస్థపై ద్వేషం పెంచుకునేలా మార్చడమే వీరి అసలు అజెండా.
………
ఇలాంటి డిజిటల్ నెట్వర్క్ల ద్వారా దేశంలో అస్థిరతను సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసే దేశద్రోహ శక్తుల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కామెడీ పేరుతో దేశ ప్రతిష్ఠను, వ్యవస్థల నైతికతను దెబ్బతీసే ఇలాంటి సైబర్ కుట్రలను తిప్పికొట్టాలి. జాతీయవాదాన్ని బలోపేతం చేస్తూ, వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.



