అతగాడి అసలు పేరు జోసెఫ్ బచ్చలకూర. అటువంటప్పుడు అదే పేరుతో అంతా పిలవాలి. యూ ట్యూబ్ ఛానెల్ పేరు తో తప్పు దారి పట్టించేందుకు …. మిషనరీలు కుట్ర చేస్తున్నాయి. మీడియా సంస్థలు కూడా దొంగ పేరునే ప్రచారం చేస్తున్నారు. జోసెఫ్ బచ్చలకూర ట్రాక్ రికార్డు మామూలుగా లేదు. క్రైస్తవ మిషనరీల సభలలో హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సనాతన ధర్మాన్ని నిలబెడతామనే వాళ్లను నడిరోడ్డుపై కొట్టాలి, తాట తీయాలి” అంటూ తీవ్ర హింసను ప్రేరేపించారు. దేశ భద్రతకు ముప్పైన నక్సలైట్ నాయకులను కీర్తిస్తూ, ఈ దేశ రాజ్యాంగాన్ని, సనాతన ధర్మాన్ని దారుణంగా దూషించారు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అండగా నిలిచినందుకే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ సమాజంలో మత విద్వేషాలు రేపుతున్నారు. హిందూ సాధువులను .. నా కొడకా అంటూ సంబోధించారు, తొక్కి పాడేస్తామంటూ సవాల్ విసిరారు.
ఇక్కడ చైనాలో జరుగుతున్న చిన్న సంఘటన గురించి తెలుసుకొందాం. అక్కడ మతమార్పిడులు చేస్తున్న పాస్టర్ ను 8 నెలల పాటు జైలులో పెట్టారు. మరి, ఆ విషయంలో… నోరు విప్పని కమ్యూనిస్టులు, మేధావులు.. ఇప్పుడు జోసెఫ్‌పై చట్టప్రకారం కేసులు పెడితే గుండెలు బాదేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఇదే తరహాలో ఒక డీఎంకే ఎమ్మెల్యేపై కేసు పెడితే ఇదే శక్తులు సైలెంట్‌గా ఉండిపోయాయి. జోసెఫ్ అన్న పేరులోనే క్రైస్తవుడు అని తెలిసిపోతుంటే, రావణ్ అనే పేరుతో సింపతీ కోసం బ్రాండింగ్ చేయటం ఇంకా దారుణం.
జోసెఫ్ కోసం ఆంధ్ర లోని క్రైస్తవులంతా తిరుగుబాటు చేయాలని పిలుపు ఇస్తున్నారు. అంటే వేదికల మీద బూతులతో తిట్టిపోస్తున్న పాస్టర్ కోసం క్రైస్తవ సమాజం మొత్తం తిరుగుబాటు చేయాలనటం ఎంత వరకు కరెక్ట్. విదేశీ నిధుల అండతో వ్యవస్థలను శాసించాలని చూసే ఇలాంటి శక్తులకు చట్టపరమైన శిక్షలు పడాల్సిందే అని కోరుతున్నారు. మతప్రచారం ముసుగులో దేశ వ్యతిరేక సిద్ధాంతాలను నూరిపోస్తూ, సమాజాన్ని ముక్కలు చేయాలని చూసే జోసెఫ్ లాంటి వారిపై జాగ్రత్త అంటున్నారు.



