తెలుగునాట టాప్ హీరోయిన్ అనే క న్నా … మిల్కీ బ్యూటీ అంటే తమన్నా గుర్తొస్తుంది. చెరగని అందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న తమన్నకు కొత్త కష్టం వచ్చి పడింది. మిల్కీ బ్యూటీ తమన్నా మీద మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యాడ్స్ ప్రమోషన్ లో భాగంగా మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్ కోసం ఆమె పని చేస్తున్నారు కాజాగా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ను షేర్ ప్లే యాప్ లో ప్రసారం చేయడం జరిగింది దీనిమీద సదరు హక్కులు ఉన్న వయాకాం సంస్థ ఫిర్యాదు చేసింది. తమన్న చేసిన పని తో తమకు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చి చెప్పింది.
దీని మీద
మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు . విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. వాస్తవానికి ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమధ్యకాలంలో తమన్నా సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ కేసులో కేవలం తమన్నా మాత్రమే కాదు చాలామంది నటులు ఉన్నారు. ఇప్పటికే నటుడు సంజయ్ దత్, గాయకుడు బాద్ షా, జాక్వలిన్ ఫెర్నాండజ్ మేనేజర్ లకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది.
ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. ఈ నెల 23న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ఆయన దూరంగా ఉన్నారు. తాను ఆ రోజున దేశంలో లేనని పేర్కొన్నారు. దీంతో తన స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడానికి మరో తేదీని సూచించాలని ఆయన పోలీసులను కోరారు.
హీరోయిన్ తమన్నా కొంతకాలంగా సినిమాలు లేవు కానీ వివాదాలు మాత్రం కావలసినవి ఉన్నాయి తాజాగా పోలీసు కేసు కూడా తమన్నా మెడకు చుట్టుకుంది