రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఝార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం బైద్యనాథ్ ను సందర్శించారు. రేపటితో రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగియనుంది. రాష్ట్రపతి హోదాలో ఝార్ఖండ్ లో ఆయన చివరి పర్యటన ఇది అని చెప్పవచ్చు. అయితే బైద్యనాథుడి దర్శనానికి వెళ్తూ ఆయన కాబోయే రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి బాబా బైద్యనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 25న ముర్ము భారత రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు