అసలు ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఏమిటి? ఎవరి కోసం, ఎందు కోసం పని చేస్తుంది?

 

అసలు ఈ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఏమిటి? ఎవరి కోసం, ఎందు కోసం పని చేస్తుంది? ఎవరైనా ఆలోచించారా? భారతీయులు సీరియస్ గా తీసుకుంటే ఈ సంస్థను ఏనాడో తన్ని తరిమేసేవారు..
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీల అణచివేత, స్త్రీ స్వేచ్ఛ, నియంతృత్వం, మరణ శిక్షల రద్దు, శరణార్థుల, ఖైదీల హక్కులు వంటి అంశాల పై పోరాడుతున్నట్లు అమ్నెస్టీ గొప్పలు చెప్పుకుంటుంది.. కానీ ఈ లక్ష్యాలు ఈ సంస్థకు ఒక ముసుగు మాత్రమే.. దాని పని తీరు ఏనాడూ పారదర్శకంగా లేదు. అమ్నెస్టీ ఏనాడైనా మన దేశం విషయంలో పాజిటివ్ గా మాట్లాడిందా?
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మీద ఎప్పుడూ విషం చిమ్మడమే అమ్నెస్టీ లక్ష్యం. తీవ్రవాదులు, ఉగ్రవాదుల హింసను అమ్నెస్టీ వ్యతిరేకించడం ఎప్పుడైనా చూశామా? సీఏఏ, ఎన్‌సీఆర్‌లకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు మద్దతుగా, జాతి వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడేందుకు అధికారం ఎవరు ఇచ్చారు?
అమ్నెస్టీ కొన్ని దేశాల్లో హింసను అసలు పట్టించుకోకపోవడం, విరాళాలను దారి మళ్లించడం, సంస్థ ఉద్యోగులు కార్పోరేట్ స్థాయి జీతాలు తీసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఇంత కాలంగా చట్ట విరుద్దంగా విరాళాలు తీసుకుంటూ పని చేస్తున్న అమ్నెస్టీని కేంద్ర ప్రభుత్వం కట్టడి చేసేసరికి గగ్గోలు పెడుతూ భారత్ లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.. నిజంగా చట్టబద్దంగా పని చేస్తున్న సంస్థ అయితే విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారో చెప్పే బాధ్యత ఆ సంస్థకు లేదా?
అసలు అమ్నెస్టీని నిషేధిస్తే బాగుండేది.. కానీ ఆ సంస్థ మన దేశం విడిచిపోతోంది అంటే దరిద్రం విదిలించి అని సంతోషిద్దాం.. కానీ ఇంత కాలం ఆ సంస్థ చేసిన చీకటి పనులపై దర్యాప్తు చేసి బాధ్యలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది..
-క్రాంతిదేవ్ మిత్రా