నేషనలిస్ట్ జర్నలిస్టులపై విషప్రచారం

జాతీయవాద జర్నలిస్టులపై పెయిడ్ మీడియా విషప్రచారం!

– అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ స్వాతి గోయెల్ శర్మ
– క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ట్వీట్ చేసిన విష మీడియా

ఎడిటర్స్ గిల్డ్ చీఫ్ శేఖర్ గుప్తా నడుపుతున్న ది ప్రింట్ అనే వెబ్ సైట్ దేశవ్యతిరేక విద్వేషపూరిత వార్తలను వ్యాప్తి చేస్తోంది. ఉన్న‌ది లేన‌ట్లు చెప్ప‌డం వారికి అలవాటైపోయింది. అంతేకాదు జాతీయ‌వాద జ‌ర్న‌లిస్ట్ ల‌పై ఉన్న‌ది లేన‌ట్లుగా ప్ర‌చారం చేయాల‌ని చూస్తోంది. స్వరాజ్య పత్రిక జాతీయవాద జర్నలిస్ట్ స్వాతి గోయెల్ శర్మ వీరి అస‌లు బాగోతాన్ని బ‌య‌ట‌పెట్టారు. దీంతో ది ప్రింట్ యాజ‌మాన్యం ప‌బ్లిష్ చేసిన‌ త‌ప్పుడు ఆర్టిక‌ల్స్ ను డిలీట్ చేసి క్షమాపణ చెప్పింది. ఈ మేర‌కు ఒక‌ ట్వీట్ చేశారు.

అక్టోబర్ 1న ఆ వెబ్ సైట్ లో ఒక విద్వేష పూరిత కథనం ప్ర‌చురిత‌మైంది. హత్రాస్ ఘ‌ట‌న‌లో కుల కోణాన్ని పట్టించుకోవ‌డం లేదంటూ స్వాతి గోయెల్ శర్మపై త‌ప్పుడు క‌థ‌నం ప్ర‌చారం చేశారు. వాస్త‌వాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తూ వార్త క‌థ‌నం ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో లవ్ జిహాద్ ల గురించి పోస్ట్స్ చేస్తున్నందుకే స్వాతిపై అక్క‌సు వెళ్ల‌గక్కారు. దళిత మహిళపై అత్యాచారం జ‌రిగితే చూడలేని గుడ్డివారు అంటూ జాతీయ‌వాద జ‌ర్న‌లిస్ట్ ల‌పై ఈ పెయిడ్ వెబ్ సైట్ దాడి చేసింది.

ఇక తనపై దుష్ప్రచారాన్ని చేయ‌డాన్ని స్వాతి గోయెల్ శర్మ ఖండించారు. “మీ రచయితలు వార్తలు తనిఖీ చేయకుండా ఒకరి కులాన్ని బట్టి వారు దళిత వ్యతిరేకులని ఆరోపించే అలవాటు ఉన్న‌ట్లు ఉంది. గతంలో ఐఐటి-కాన్పూర్‌కు చెందిన వాషి శర్మ విషయంలో కూడా ఇలాగే చేశారు. క్షమాపణలు చెప్పారు. హత్రాస్ ఘ‌ట‌న‌లో నేను కులాన్ని ఎక్కడ ప్రస్తావించ‌లేదు. ఒకవేళ నేను అలా చేశాన‌ని మీరు అంటే రుజువు చూపండి. లేదంటే క్షమాపణ చెప్పాలి” అంటూ ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివ‌ర‌కు ఆ పెయిడ్ వెబ్ సైట్ యాజ‌మాన్యం స్వాతి గోయెల్ శ‌ర్మ‌కు క్షమాపణ చెప్పింది.

వాస్త‌వానికి స్వాతి గోయెల్ శర్మ ఒక గ్రౌండ్ రిపోర్టర్. దళితుల హక్కులు, వారిపై జరిగిన నేరాల గురించి ఆమె ఎన్నో క‌థ‌నాలు రాశారు. ఆమె దళిత కార్యకర్త సంజీవ్ నెవార్, అగ్నివీర్‌తో కలిసి ఒక ఎన్జీఓను నడుపుతున్నారు. ఇక ఎన్డీటీవీ త‌ర‌ఫున జాతీయ‌వాదంపై విషం క‌క్కే వెబ్ సైట్స్ క్వింట్, స్క్రోల్, వైర్, ప్రింట్ ల‌లో త‌రుచుగా ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాలే వ‌స్తుంటాయి. వాటిని జాతీయ‌వాద జ‌ర్న‌లిస్ట్ లు ప్ర‌శ్నిస్తే క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం వారికి అల‌వాటైపోయింది.