చైనా, పాకిస్తాన్ లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే..

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలకు ఇప్పటికే దేశం ఎంతో మూల్యం చెల్లించుకుంది. ఇంకా చెల్లించుకుంటూనే ఉంది. ఆ తప్పిదాలలో మౌలికమైనదే దేశ విభజన, దాని నుంచి పుట్టుకొచ్చినదే కశ్మీర్ సమస్య, కశ్మీర్ లో కొంత భూభాగం, పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. మొత్తం కశ్మీర్ నాదే అని దాని కోసం పాకిస్తాన్ ప్రత్యక్ష, ప్రచ్ఛన్న, యుద్ధాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ భారత్ ఎంతో సహనం చూపిస్తోంది. ఆ సహనానికి పాకిస్తాన్ ఇంకా పరీక్ష పెడుతూనే ఉంది. దానిపరాకాష్ట గిల్గిట్ బాల్టిస్థాన్ లో తాజాగా నవంబర్ 15న ఎన్నికలు నిర్వహించటం.

పాకిస్తాన్ చైనా ఉపగ్రహంలాగా మారిపోయింది చైనా కోసం ఏదైనా చేసేందకు సిద్ధపడుతోంది. అందులో భాగమే గిల్గిట్ బాల్టిస్థాన్ లో ఎన్నికలు నిర్వహించటం తద్వారా గిల్గిట్ బాల్టిస్థాన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించటం. అందుకే ఆ ఎన్నికల ద్వారా చైనా ఒక రకంగా విజయం సాధించినట్లు అయ్యింది. గిల్గిట్ బాల్టిస్థాన్ లపై చైనా కన్ను వేయటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆ వివరాలు సంక్షిప్తంగా…

1} మొదటది చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ దృష్ట్యా గిల్గిట్ బాల్టిస్టాన్ ఎంతోవ్యూహాత్మకమైనది ఎదగడానికి ఏంతో కీలకమైనది. దీంతో బీజింగ్ ఎవరు ఊ హించని గొప్ప శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) కు ఉత్తరాన ఉన్న గిల్గిట్ బాల్టిస్టాన్ ఆఫ్ఘనిస్తాన్ వఖాన్ కారిడార్, చైనా జిన్జియాంగ్ ఉయ్ఘర్ అటానమస్ రీజియన్, లడఖ్, పాకిస్తాన్ ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావెన్సిస్ ల సరిహద్దులను పంచుకుంటోంది.

2} రెండోది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) కు గిల్గిట్ బాల్టిస్తాన్ ఏంతో కీలకం. – బీజింగ్ బిఆర్ఐకి ఎంతో “ప్రధానమైనది , ఇది చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ (సిఎమ్ఇసి) ను కూడా కలుపుతుంది, దక్షిణ ఆసియాలో, బీజింగ్ ప్రభావాన్ని పటిష్టం చేయడానికి ఎంతో ముఖ్యమైనది .పాకిస్తాన్‌ను చైనాతో కలిపే అన్ని సిపిఇసి రోడ్లు, రైల్వే లైన్లు, చమురు, గ్యాస్ పైప్‌లైన్‌లు ఈ భూభాగం గుండానే వెళ్లాలి. సిపిఇసి ఇన్ఫ్రా ప్రాజెక్టులలో బిలియన్ డాలర్లను చైనా పెట్టుబడి పెట్టింది , ఆ పెట్టుబడులను చట్టబద్ధం చేసుకొనే ప్రయత్నంలోభాగంగా ఈ ప్రాంతానికి రాజ్యాంగబద్ధమైన ప్రామాణికతను ఇవ్వడానికి 2015 నుండి పాకిస్తాన్‌ను ప్రోత్సహిస్తోంది.

3}మూడవది , గిల్గిట్ బాల్టిస్థాన్లలో పాలరాయి, బంగారం, యురేనియంతో సహా ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి . మే 2019 లో, పాకిస్తాన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (బోఐ) గిల్గిట్ నగరం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్‌పాండస్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను స్థాపించడానికి ఆమోదం తెలిపింది. ఇది 250 ఎకరాలలో ఉంది. ఇది స్కార్డు విమానాశ్రయం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకార్డు-గిల్గిట్ రహదారిపై ఉంది.

గిల్గిట్ బాల్టిస్తాన్ లు చైనా పాకిస్తాన్ అక్రమ కూటమికి, భారత్ కు మధ్య భౌగోళిక రాజకీయా యుద్ధాలకు ప్రధాన వేదికగా మారిపోయింది. 1963 లోపాకిస్తాన్ గిల్గిట్ బాల్టిస్టాన్ కు ఉత్తర సరిహద్దులలో ఉన్న షాక్స్ గమ్ లోయను చైనా కు ఉచితంగా దానం చేసింది. మొత్తం మీదపాకిస్తాన్ చైనాలు భారత సార్వభౌమత్వంను సవాలు చేస్తున్నాయి. దానికి దీటైన సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమైనది. దానికి యుద్ధం అనివార్యంగా కనబడుతున్నది ఆ పరిస్థితులు ఎదుర్కోవటానికి భారత్ ఆయుధాపరంగా ఆర్థికంగా తిరుగులేని శక్తిగా ఎదగాలి. గడచిన ఏడు దశాబ్దాలుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే సరియైన గాడిలో పడుతున్నది చారిత్రిక తప్పిదాలను చక్కదిద్దుకోవటానికి సిద్ధపడాలి. దానికి దేశమంతా ఒకే తాటిమీదికి రావాలి.

– రాంపెల్లి మల్లికార్జున్