మన సోనూ బంగారం…

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. లాక్ డౌన్ స‌మ‌యంలో సోనూ చేసిన సేవ‌లకుగానూ ఐక్యరాజ్య సమితి (UNO) అనుబంధ.. యూఎన్‌డీపీ (United Nations Development Programme) సంస్థ స్పెషల్‌ హ్యుమనిటేరియన్‌ అవార్డును (SDG Special Humanitarian Action Award ) ప్ర‌క‌టించింది.

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విధించిన‌‌ లాక్‌డౌన్‌ కాలంలో ఇబ్బందులుపడిన లక్షలాది వలసకూలీలు, విద్యార్థులను సోనూసూద్ అన్నివిధాలా ఆదుకున్నాడు. ఓ వర్చువల్‌ కార్యక్రమం ద్వారా సోమవారం సాయంత్రమే ఈ అవార్డును ప్రదానం చేశారు.

హాలీవుడ్ ప్రముఖులు ఏంజెలినా జోలీ, డేవిడ్‌ బెక్‌హమ్‌, లియోనార్డో డి కాప్రియో, ప్రియాంక చోప్రా గతంలో ఈ అవార్డు అందుకున్నారు. పాటు అతికొద్ది మందికి మాత్ర‌మే ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం తన బాధ్యతను పెంచిందని సోనూసూద్ అన్నాడు..