సమాజాన్ని నిర్మించే వాడు వైశ్యుడు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఐలయ్య

Disclaimer :- The views are not necessarily of Myindmedia.

సమాజాన్ని నిర్మించే వాడు వైశ్యుడు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాడు ఐలయ్య

ఆంగ్లం లో “freedman” అనే పదం వుంది. చాలామంది యూరోప్ మరియు అమెరికా దేశస్తుల ఇంటిపేరు “Freedman” కొందరికి “freeman” అని ఉంటుంది. ఫ్రీమాన్ అంటే దాస్యం లోంచి బయటపడ్డవాడు అని అర్థం. మరి దాస్యత ఎవరినుండి ?  రాజునుండి. పాశ్చాత్య దేశాల్లో దాసుడుగా ఉండటం ఏమిటి అని అనుకుంటున్నారా ? అవును భారతావనిలో  లేని దాస్యత యూరోప్ లో ఒక పద్దతి ప్రకారం ఉండేది. దానివల్ల ఉత్పత్తి, పెరుగుదల పారిశ్రామికీకరణ మందంగా సాగేది. ఎందుకంటే వ్యాపార వర్గాలు భారత దేశంలో ఉన్నట్టు ప్రాచీన యూరోప్ లో లేవు.

ఎలా ప్రాచీన భారతం , తరువాత యూరోప్ అభివృద్ధి సాధించాయి ?  దాని మూలాలు తెలుసుకునే ముందు పాశ్చాత్య చరిత్ర పై దృష్టి సారిస్తే యూరోప్ లో సమాజాన్ని వర్గాలుగా ఎలా విభజించారో అర్థం అవుతుంది. అలాగే ఆ వర్గాలకు భారత వర్ణాశ్రమ ధర్మానికి మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. ఆ వర్గాలలో వైశ్యుల పాత్ర ఎంత అన్నది అర్థం అవుతుంది.

భారతావనిలో వర్ణాశ్రమం ఉండేది, మనువు వర్ణాలను నిర్వచించాడు దానివల్ల  సమాజం వర్గాలుగా విభజించబడి వివక్ష వచ్చింది అని ఎప్పుడో చెప్పిన మనువు గురించి ఇప్పుడు మాట్లాడే కుహనా మేధావులకు యూరోప్ లో కూడా  సమాజాన్ని వర్గాలుగా విభజించారు అని తెలియదు. క్రిస్టియానిటీ యూరోప్ లో మధ్య యుగం లో పాకింది. అంతకు మునుపు గ్రీక్ మరియు రోమన్ దేవతలను పూజించే వారు. క్రిస్టియానిటీ వచ్చిన తరువాత  మధ్యయుగం లో యూరోప్ సమాజం మూడు వర్గాలుగా  మారింది.  ఆ మూడు వర్గాలు

  • క్లర్జి  ( Clergy)
  • నోబెల్ (Noble )
  • పేసంట్ (peasant )

Clergy వర్గంలో క్రిస్టియన్ మత బోధకులు ఉండేవారు. మన దేశం లో రాజుకు మంత్రి ఎలాగో  వీరి పాత్ర ఆలా షుమారుగా  ఉండేది. కాకపొతే వీరు క్రైస్తవ మతం తప్ప వేరే మతాలని సాంప్రదాయాలని తొక్కి పడేసే వారు. వీరికి ఎవరన్నా క్రెస్తవాన్ని తప్పుబడితే శిక్ష విధించే అధికారం ఉండేది. ఆ శిక్షని రాజులు (NOBLES) అమలు పరచేవారు

NOBLES , రెండవ వర్గం, నోబుల్ వర్గం రాజ్యాన్ని ఏలే వారు. మన దేశంలో రాజులు చక్రవర్తులు ఎలాగో వీరు కూడా అలాగే.  Clergy చెప్పిన విధంగా రాజ్యం ఏలే వారు. ముఖ్యంగా మత విషయాలలో నేరాలకు శిక్ష విధించే విషయంలో వీరు చెప్పిన మాట వినేవారు. పక్క దేశాలను ఆక్రమించడం యుద్ధాలు చేయడం నోబుల్ చేసేవారు. వీరికింద వస్సల్స్ (VASSALS ) ఉండేవారు వారు భూమికి అధిపతులు. రాజ్యంలో వ్యవసాయం చేయించటం పన్నులు వసూలు చేయటం వీరిపని. వీరు రాజుకి కట్టుబడి వుంటారు

PEASANTS, పేసంట్  మూడవ వర్గం,  అనగా సామాన్య ప్రజలు.  సామాన్య ప్రజలకి భూమిపై  హక్కు లేదు.  భూమి ఒక భూస్వామి ( VASSAL) చేతిలో ఉంటుంది. అందుకే దున్నే వాడిదే భూమి అనే సిద్ధాంతము కమ్యూనిస్టులు తెచ్చారు. ఈ పెసంట్ లలో మూడు ఉపవర్గాలు వున్నాయి , ఫ్రీమన్ (FREEMAN), విలన్  (VILLEIN ) మరియు సెర్ఫ్ ( SERF లేదా SLAVE). ఫ్రీమన్ అనేవ్యక్తి భూమిపై పనిచేస్తాడు కానీ యజమానికి బానిస కాడు. తన స్వంత భూమి పై వ్యవసాయం చేస్తూ ఆ జమిందారుకి సుంకం కడతాడు.  స్లేవ్ అనగా బానిస ఎప్పటికి యజమాని కింద పడివుండాలి. ఎప్పటికో కానీ ఆ బానిస ఆ పరిస్థితిలోంచి బయట పడడు. ఇక విలన్ పరిస్థితి ఫ్రీ మాన్ మరియు బానిస మధ్య ఉంటుంది. విలన్ కి భూమి ఉంటుంది కానీ ఇష్టం వచ్చినట్టు ఒక యజమాని / ప్రాంతం నుండి మరొకచోటుకి పోలేడు. అన్నట్టు మన సినిమా విలన్ అనే పదం ఈ విలన్ నుండి వచ్చిందే. అదొక పెద్ద కథ లెండి. ఇంటర్నెట్ లో విలన్ పదం మూలాలు చదవండి.

బలమైన  వ్యాపార వర్గం లేని యూరోప్ లో అభివృద్ధి కుంటుకుంటూ నడిచేది. మెల్లిమెల్లిగా ప్రజలు దాస్యం లోంచి విముక్తి అయ్యి ఉత్పత్తి చేయటం. నచ్చిన చోట అమ్మటం. వస్తుమార్పిడి పెరగటం తో వ్యాపార వర్గం పాశ్చాత్య దేశాలలో నెమ్మదిగా పుట్టింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే యూరోప్  సమాజం మూడు వర్గాలుగా వుంది కానీ నాలుగు వర్గాలుగా కాదు.  దీన్ని ప్రాచీన భారత వర్ణాశ్రమంతో పోల్చితే బ్రాహ్మణ, క్షత్రియ శూద్ర వర్ణాలతో పోల్చవచ్చు. మరి వైశ్యులు లేదా వ్యాపార వర్గం వైశ్యులు ప్రాచీన యూరోప్ లో లేరు.

ఫ్యూడల్ వ్యవస్థలో  జమీందార్లు మరియు  రాజులూ ఉత్పత్తిని దోచేవారు. వారి సంపాదనని తిరిగి సమాజం పై పెట్టడం తక్కువ. ఎవరైతే భూమిపై పనిచేయకుండా వ్యాపారం మొదలుపెట్టారో అప్పటినుండి వ్యాపారవర్గం పుట్టింది.ఈ వ్యాపార వర్గాలు ప్రజలు చేసిన  ఉత్పత్తిని అమ్మి డబ్బులు సంపాదించడమే కాకుండా ధనాన్ని కూడబెట్టడం తరువాత ఎవరైతే వైజ్ఞానిక రంగాలలో ముందంజ వేసి కొత్త పరికరాలు కనిపెడతారో  వారికి డబ్బు ఇచ్చేవారు. ప్రఖ్యాతిగాంచిన మెర్సిడెస్ కంపెనీ అలాగే ఒక వ్యాపారి ఇచ్చిన డబ్బులతో ప్రారంభమై, కార్ల్ బెంజ్ సతీమణి కట్నం డబ్బులను కూడా వాడుకుని వృద్ధిలోకి వచ్చింది. యూరోపు భారత మరియు చైనా దేశాల కన్నా పారిశ్రామికీకరణను త్వరగా అమలు చేసి వైజ్ఞానిక రంగంలో ముందంజ వేయడానికి కారణం  ఆ వ్యాపార వర్గం అని కూడా చెప్పవచ్చు.అలాగే  విశ్వవిద్యాలయాల కు డబ్బులు ఇచ్చి ఆ యురోపియన్ వ్యాపారులు సమాజానికి తోడ్పడ్డారు.

ఇక భారత దేశం గురించి మాట్లాడదాం.  విషయం తెలియకుండా అయోమయం గా ఉండే కమ్యూనిస్టులు జాతికి పట్టిన కాన్సర్. వీరికి తోడుగా మతాంతీకరణ చేసే క్రైస్తవ మిషనరీలు హిందూమతంపై దెబ్బతీస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి.  కంచె ఐలయ్య లాంటి కుహానా మేధావులు దేశానికి పట్టిన అతిపెద్ద చీడ. సాధారణంగా వామపక్ష మేధావులకి విశ్లేషించే తెలివి  ఉండదు ఎందుకంటే వారు గణితం చదవరు బూజు పట్టిన వామపక్ష సిద్ధాంతాలు చదువుతారు కనక. వర్ణాశ్రమ ధర్మంలో వైశ్యుల పాత్ర ధనాన్ని తయారుచేయటం అలాగే ధనాన్ని సమాజానికి ఉపయోగించటం. ప్రాచీన భారతం GDP  ( జాతీయ ఉత్పత్తి ) లో ప్రపంచంలో రెండవ స్థానం లో ఉండేది. దాని వెనుక వైశ్యుల పాత్ర ప్రముఖంగా వుంది.  దానిగురించి ఈ వ్యాసం లో రాయటం కుదరదు. మొదట ప్రాచీన కాలంలో భారత GDP పై జరిగిన పరిశోధన చదువుకుంటే అప్పటి పరిస్థితులు అర్థం అవుతాయి. అంగస్ మాడిసన్ పరిశోధన చదవండి

http://www.ggdc.net/maddison/maddison-project/home.htm

ప్రాచీనకాలంలో ధనం ఎలా తయార య్యేవి ఎవరు ధనాన్ని దాచేవారు ?  ధనాన్ని ఇతరులకు సహాయంగా  ఇచ్చేవారు ?  రాజు ఆ పనిచేస్తాడనుకుంటే పొరపడుతున్నారు. ఆయన పని దేశాన్ని భద్రంగా కాపాడటం ధర్మబద్ధంగా పరిపాలన చేయటం. రాజ్యంలో బట్టలు కుట్టాలన్నా, కుండలు తయారు చేయాలన్నా ఇంకా ఏ  రకమైన ఉత్పత్తి చేయాలన్నారు డబ్బు ఇచ్చేది వైశ్యులే.  మొత్తం పరిశ్రమని, ఉత్పత్తిని తమ ధనంతో సమాజానికి ఉపయోగపడేలా చేసేది వైశ్యులు మాత్రమే.  ఇందాక చెప్పినట్టు యూరోపియన్ దేశాల్లో కూడా వ్యాపారుల పాత్ర పెరిగినప్పుడే  ఆ దేశాల వృద్ధి చెందడం ప్రారంభించాయి అంతకుముందు ఫ్యూడలిజం తో వారసత్వంతో బానిసత్వం తో రాజుల కింద నలిగిపోయాయి.  ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది వ్యాపారం కోసమే, అది మర్చిపోకండి.

వైశ్యులు ధనాన్ని  రాజ్యంలోని పౌరులకే కాకుండా రాజులకి  కూడా ఇచ్చేవారు. వీరుడైన రాణాప్రతాప సింహుడు ఒక వైశ్యుని మూలాన తిరిగి తన రాజ్యం నిలబెట్టుకో గలిగాడు అతను లేకపోతే అడవిలో అలమటించి చనిపోయేవాడే. ఆ వైశ్యుడు పేరు భామా షా .  ఆ రాణా ప్రతాపే  లేకపోతే  రాజస్థాన్ నుండి మహారాష్ట్ర వెళ్లిన మరాఠా సైన్యం లేదు. ఆ సైన్యం లేకపోతె శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ మొఘలులతో పోరాడేవాడే కాదు ప్రస్తుత భారత దేశం ఇలా ఉండేది కాదు.

ఈ కాలంలో కూడా వర్ణాశ్రమ ధర్మం ఇంకో రూపం లో  ఉంది. ప్రజాస్వామ్య దేశాల్లో  నయితే మరీ  ప్రస్ఫుటంగా ఉంది. అమెరికాలో లేదా భారతదేశంలో క్షాత్ర ధర్మాన్ని నిర్వహించేది ఆ దేశ ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు. అలాగే దేశ ఆర్థిక వ్యవహారాలు మొత్తం నిర్వహించేది ఆర్థిక సంస్థలు ఈ ఆర్థిక సంస్థలు నేటి వైశ్యుల  పాత్ర వహిస్తాయి. అత్యంత  ధనికులైన బిల్ గేట్స్ కానీ వారెన్ బఫెట్ కానీ వ్యాపారవేత్తల కోవకే వస్తారు. వారు ధనం చాలా సంపాదించి తమ కంపెనీలని  వృద్ధి చేశారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగులకు జీవనోపాధి కల్పించారు. ఒక కంపెనీ పెట్టాలనుకున్నా  లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్నా  మనకు కావలసిన డబ్బు ఇచ్చేవారు ఏ కులమైనా కానీ వహించేది  వైశ్యుల పాత్ర మాత్రమే. సినిమా పరిశ్రమలో చాలామంది డబ్బులు ఇచ్చే వారు వైశ్యుల కులానికి చెందినవారు కారు కానీ  వ్యవహారరీత్యా వాళ్లంతా వైశ్యులే.

వైశ్య కులం లో పుట్టిన వారు చిన్నతనం నుంచి డబ్బులు ఎలా వాడాలో తెలిసిఉంటుంది వారు డబ్బులు ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు డబ్బులు వినియోగం చేయటం డబ్బుని వేరేవారికి ఇచ్చి పరిశ్రమలు పెంపొందింపజేయటం తమ కుటుంబాలలో నేర్చుకుంటారు. అలా డబ్బు దాచుతారు కాబట్టే వారు “గుప్త” లు అనుకుంటే తప్పు వారి గుప్త దానాలు ఎవరికీ ఎరుక ? సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు కాబట్టే వారు “శ్రేష్ఠులు” శ్రేష్ఠ అనే పదం నుండే శ్రేష్టి, శెట్టి, చెట్టి, చెట్టియార్ లు వచ్చాయని ఐలయ్య కి తెలియదు….. తెలిసినా ఒప్పుకోని వితండవాది మరియు వింత జీవి మన ఐలయ్య గారు.

హిందూ సమాజం లో వైశ్యులు  ధార్మికులు. తమ ధనాన్ని  సమాజానికి విరాళాలుగా ఇస్తారు. ఘన శ్యామ్ దాస్ బిర్లా బ్రిటిష్ వారితో పోటీపడి వ్యాపారం చేసేవాడు భారత స్వతంత్ర పోరాటం లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అయన భారీగా విరాళాలు ఇచ్చే వాడు. ఆయన తదనంతరం ఆయన కుటుంబం పలు సేవా కార్యక్రమాలు చేసింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BITS పిలాని, బిర్లా మందిరాలు, పలు గోశాలలు వారి ధనం తో సమాజం కోసం వాడారుకానీ  డబ్బుని నిల్వ చేయలేదు. ఇప్పటికి భారత చరిత్రలో గొప్పగా చెప్పుకునే అంబాసిడర్ కారు బిర్లా సంస్థదే. అలాంటి గొప్ప వైశ్యుడైన శ్యామ దాస్ బిర్లా ముందు దేశాన్ని విచ్ఛిన్నం చేసి విదేశీ మెతుకుల కోసం వెంపర్లాడే ఒక పరాన్న బుక్కు మన  ఐలయ్య గారు.

చిత్రమేమిటంటే మరొక ప్రముఖ వైశ్యుడు, శ్రీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ   పేరుకు  వైశ్య కులంలో పుట్టినా చాలా కాలం పాటు న్యాయవాద వృత్తి చేసి ధర్మం వైపు నిలిచాడు. ఆ తరువాత బ్రిటిష్ వారిపై స్వతంత్ర పోరాటం చేసాడు. మరి ఆయన చేసింది వ్యాపారం కాదు ధర్మ పరిరక్షణ,దేశ స్వాతంత్ర సముపార్జన. గాంధీజీ పేరుకి వైశ్యుడైనా స్వభావ మరియు వ్యవహార రీత్యా క్షత్రీయుడు.  అలాగే తెలుగువారికి ఒక రాష్ట్రం తెచ్చిన వ్యక్తి పొట్టి శ్రీ రాములు వైశ్యుడే,.  ప్రతి పుణ్య క్షేత్రాలలో సత్రాలను పోషిస్తూ అన్నదానం చేసే వారు వైశ్యులే.  మారుతున్న కాలంలో ఎంతోమంది వైశ్యులు వైద్యులుగా అధ్యాపకులుగా వున్నారు. భావి భారత పౌరులకు బడిలో  గణితం చక్కగా చెప్పేది వైశ్యులే. దేశం కోసం ప్రాణ త్యాగం కార్గిల్ యుద్ధం లో  చేసిన మేజర్ వివేక్ గుప్తా కూడా వైశ్యుడే.

http://indiatoday.intoday.in/story/kargil-war-from-the-ashes-of-the-dead-rise-the-tales-of-indias-heroes/1/254363.html

అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్న కులాన్ని దురహంకారం తో విమర్శిస్తూ దళిత ముసుగులో తిరుగుతూ నోటికి వచ్చినట్టు వాగే  క్రిస్టియన్ మతాహంకారి కంచె ఐలయ్య షెప్పర్డ్. ఆయన పుట్టిన కులానికి ఆయన చేసిన సేవ కన్నా పక్క కులాలపై పడి ఏడవటం ఎక్కువ. గతం లో బ్రాహ్మణులపై ఏడ్చిన ఏడుపు, నేనెందుకు హిందువునవుతా అని దళిత వాదం ముసుగులో వదిలిన కక్కసు, సమయం దొరికినప్పుడల్లా టీవీ ల లో  కక్కిన అక్కసు లాంటివి మానుకుని తాను పుట్టిన కులంలో పేదలకు సహాయపడితే కనీసం మానవ జన్మ ఎత్తినందుకు అయన జీవితం సార్థకం అవుతుంది.

పుట్టటం చావటం గురించి మాట్లాడినప్పుడు  పుట్టలో చెదలు పుట్టవా గిట్టవా అంటాం.  ఐలయ్య గారి  జీవితం  చెద కన్నా హీనం, చెదలు కొన్ని పురుగులకు కన్నా ఆశ్రయం ఇస్తాయి. పుట్టి బుద్దెరిగాక  తెలిసో, తెలియకో పక్కవాడికి నయాపైసా కి ఉపయోగపడని ఐలయ్య గారికి, సమాజ సేవలో పాటుపడ్డ వర్గాల్ని విమర్శించే స్థాయి, విచక్షణ ఏమాత్రం లేవు. ఐలయ్య గారి జీవితం కాన్సర్ కి తక్కువ వైరస్ కి ఎక్కువ.

అయన నోటిలో పడితే బాక్టీరియా కూడా చచ్చిపోతుంది పేరువింటే వైరస్ పారిపోతుంది.