కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ అప్లికేషన్

కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ అప్లికేషన్-3 వ్యాపారుల కోసం ఉద్యోగ్ ( ఉద్యమ్ ) ఆధార్ ద్వారా కేవలం ఒక్క నిముషంలో లోన్ సదుపాయం

ఇప్పటికే ఏదైనా వ్యాపారం నిర్వహిస్తూ జీఎస్టీ, ఐటీఆర్ లాంటి డాక్యుమెంట్లు, మూడేళ్ళ పాటు మంచి క్రెడిట్ హిస్టరీ, ఐటీ ఫైలింగ్ , జీఎస్టీ ఫైలింగ్ కలిగి ఉన్న వ్యాపారుల కోసం కేవలం ఒక్క నిముషంలో లోన్ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసే ఏర్పాటు చేశారు. దీనికి ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం దీనిని ఉద్యమ్ ఆధార్ అని పేరు మార్చారు. ఒక వ్యక్తికి ఆధార్ కార్డు ఎలాగో ఒక వ్యాపారం చేసే సంస్థ యొక్క గుర్తింపు కోసమే ఉద్యమ్ ఆధార్.

కింద ఇచ్చిన మొదటి లింక్ లో పూర్తి ఉచితంగా ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రొప్రైటరీ, పబ్లిక్ లేదా ప్రైవేట్ లిమిటెడ్, ట్రస్టు, హిందూ అవిభక్త కుటుంబం, LLP లు, ఏక వ్యక్తి సంస్థలు అనే కేటగిరీలలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలస్సి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగ్ ఆధార్ కలిసి ఉన్న వారు రెండవ లింక్ లో తగిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయడం ద్వారా నేరుగా లోన్ పొందవచ్చు. ఒకవేళ మీ దరఖాస్తు తిరస్కరించిన పక్షంలో తగిన కారణం మీకు తెలియజేస్తారు.

https://udyamregistration.gov.in/Government-of-India/Ministry-of-MSME/online-registration.htm

https://www.psbloansin59minutes.com/home