మైండ్ మీడియా వారి ‘ఉగాది కవితల పోటీలు’

 మైండ్ మీడియా వారి ‘ఉగాది కవితల పోటీలు’

ప్రకృతి మాత వసంతమాసపు పచ్చచీరను కట్టుకుని, కోయిల కమ్మటి గానం స్వాగతిస్తుండగా, మనోజ్ఞంగా కనువిందు చేసే తరుణం… ఏడాది పాటు తెలుగు మనసులన్నీ వేచి చూచిన శుభతరుణం ఆసన్నమయ్యే సమయం … మన తొలి పండుగ వచ్చిందోయ్, అంటూ ప్రతి ముంగిలి, కళకళ లాడిపోయే క్షణం… ఆ క్షణంలో మీ మనసులో కలిగే స్పందనకు చక్కటి అక్షరరూపం ఇస్తే… అది మరిన్ని మనసుల్ని రంజింపచేసే చక్కటి కవిత అవుతుంది. అటువంటి కవితల్ని రాసి, మాకు పంపండి. మీ కవితల్ని రేడియో లో వినిపిస్తాం, మంచి మంచి బహుమతులు కూడా అందిస్తాం.

కవితల పోటీ నియమాలు 

——————————
* ఒకరు ఒక కవితను మాత్రమే పోటీకి పంపాలి.
*కవిత కనీసం ఒక పూర్తి పేజీ నిడివి ఉండాలి. ఎవరి రచనలకు అనుసరణ/అనుకరణ/అనువాదం కాదన్న హామీ పత్రాన్ని జత చెయ్యాలి. మీ చిరునామా, ఫోన్ నెంబర్ అందించడం తప్పనిసరి.
*తెలుగు సంప్రదాయాన్ని, ఉగాది విశిష్టతను ప్రతిబింబించే కవితలు మాత్రమే పోటీకి స్వీకరించాబడతాయి.
*భావము, భాష, కవితాశిల్ప సౌందర్యానికి పెద్ద పీట వేస్తాము. కవితల విషయంలో మా న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి వాదోపవాదాలకు తావు లేదు.
*కవితలు మాకు పంపాల్సిన చివరి తేదీ – మార్చ్ 15. కవితలను info@myindmedia.com కు పంపగలరు.
బహుమతుల వివరాలు
——————————
ప్రధమ బహుమతి : 3000 రూ.
ద్వితీయ బహుమతి : 2500 రూ.
తృతీయ బహుమతి : 1500 రూ.
మూడు ప్రోత్సాహక బహుమతులు – ఒక్కొక్కటీ – 1000 రూ.