మైండ్ మీడియా వారి “పద్యం- హృద్యం “ పోటీలు

పద్యం హృద్యమైన భావాలను లయబద్ధమైన ఛందస్సుతో అల్లిన మాలిక. పద్యం తెలుగువారి సంపద, ఒక్క పద్యం కూడా నోటికి రాని తెలుగువారు ఉండరేమో ! అందుకే మన సాహిత్యంలో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న పద్యానికి, పెద్దపీట వెయ్యాలని, పద్యాల పోటీలు నిర్వహించనున్నది “మైండ్ మీడియా.” ఈ పోటీలో అన్నివయసుల వారూ పాల్గొనవచ్చు.

ప్రధమ విజేత – 3,000 రూ.

ద్వితీయ విజేత – 2500 రూ.

తృతీయ విజేత – 1500 రూ.

కన్సలేషన్ ప్రైజ్ లు – 1000 (1000 x3= 3000) రూ.

పద్యాల పోటీల నిబంధనలు

  1. ఒకరు ఒక ఎంట్రీని మాత్రమే పోటీకి పంపాలి. మొత్తం 5 పద్యాల వరకు (ఏ ఛందస్సులో నైనా) పంపవచ్చు.
  2. పద్యాలు పూర్తిగా భారతీయతను ప్రతిబింబించేలా ఉండాలి.
  3. పద్యాల ఎంపిక విషయంలో తుదినిర్ణయం మాదే. దీనిపై ఎటువంటి వాదోపవాదాలు ఉండవు.
  4. పద్యాలు తమవే నని, ఇతరుల పద్యాలకు అనుకరణ, అనుసరణ కాదన్న హామీపత్రం జతచెయ్యాలి.
  5. ఏ పద్య ప్రక్రియను ఎంచుకున్నా, యతి, ప్రాస, ఛందస్సు వంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవి లేని పద్యాలు పోటీకి అంగీకరించబడవు.
  6. పద్యాలు పంపాల్సిన ఈమెయిలు info@myindmedia.com
  7. మాకు చేరాల్సిన చివరి తేదీ…31-12-2015

1 COMMENT