“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

ప్రియమైన మిత్రులకు,

మీ అందరి కోరికపై, ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు పంపేందుకు గడువు పోడిగించబడింది. ఈ పోటీ నియమ నిబంధనలు, వివరాలు.

మైండ్ మీడియా వారి “హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీలు

——————————————————-

సంగీతం – మనసు భాష. అందుకే పక్షులు, పాములు, శిశువులూ, సమస్త జగతి మధురసంగీతం వింటే మైమరచిపోతాయి. మంచి సంగీతానికి, ఇక సాహిత్యం తోడైతే, శ్రోతలు ఆ పాటలో, భావంలో మమేకమైపోతారు. అందుకే మంచి సంగీతాన్ని, సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో – సంగీతం పట్ల మక్కువతో చేసిన వివిధ ప్రైవేట్ ఆల్బమ్స్ ను పోటీలకు ఆహ్వానిస్తోంది – మైండ్ మీడియా.  లలిత గేయాలు, ఆధ్యాత్మిక గేయాలు, ప్రేమ గీతాలు, భావ గీతాలు – ఇలా ఏవైనా, పోటీలకు అర్హమే. 1980 తర్వాత రికార్డు చేసిన ఆల్బమ్స్ మాత్రమే పోటీలకు పరిగణించబడతాయి. ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులు త్వరలోనే మేము నిర్వహించబోయే ఘనమైన సభలో అందించబడతాయి.

ప్రధమ విజేత – 10,000 రూ.

ద్వితీయ విజేత – 6000 రూ.

తృతీయ విజేత – 3000 రూ.

కన్సలేషన్ ప్రైజ్ లు – 2000 (2000 x3= 6000) రూ.

పోటీలకు ఆల్బమ్స్ పంపాల్సిన ఈమెయిలు ఐ.డి. :info@myindmedia.com. ఆల్బమ్స్ మాకు చేరాల్సిన చివరి తేదీ – 20.2.16