హథ్రస్ కేసు కీలకమలుపు…?

హథ్రస్ కేసు కీలకమలుపు తిరుగుతోంది. 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు, సందీప్ సింగ్‌తో దళిత యువతి నిరంతరం టెలిఫోనిక్ టచ్‌లో ఉన్నట్లు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. ఇది ఈ కేసులో కొత్త మలుపు.ఈ కేసులో ప్రధాన నిందితుడు సందీప్, బాధితుడికుటుంబం మధ్య 2019 అక్టోబర్ 13 నుంచి ఫోన్ సంభాషణ ప్రారంభమైనట్టు యూపీ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, సందీప్, బాధితుడి కుటుంబ సభ్యుల మధ్య 104 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. 62 అవుట్ గోయింగ్, 42 ఇన్ కమింగ్ కాల్స్ ఉన్నాయి.

మరోవైపు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కొన్ని గ్రూపులు బాధితుల బంధువుకు 50 లక్షల రూపాయలు ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు .

‘పెద్ద ఎత్తున హింసను నివారించడాని కే రాత్రి సమయంలో దహన సంస్కారాలుపూర్తి చేసినట్లు ‘, యుపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది..అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం, హథ్రస్ కేసులో “అత్యాచారం’ జరిగినట్టు ఆధారాలు లేవని పేర్కొంది. అయితే శారీరక దాడికి ఆధారాలు ఉన్నాయని .మెడ వెనుక భాగంలో గాయాలున్నాయని రిపోర్ట్ ఇచ్చింది. దీనిఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. కేసుకు సంబంధించిన విషయాలను సమర్పించడానికి యోగి ప్రభుత్వం సిట్ ప్యానల్ కు మరో 10 రోజులుగడువు ఇచ్చింది.

అటు హథ్రస్ కు వెళ్తున్న కేరళ పాత్రికేయునితోపాటు మరికొందరిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. వీరికి రాడికల్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణ.. వీరు ఢిల్లీ నుంచి హథ్రస్ వెళ్తుండగా మధుర దగ్గర సోమవారం అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ముజఫర్ నగర్‌కు చెందిన అతిక్ ఉర్ రెహమాన్, బహ్రయిచ్‌కు చెందిన మసూద్ అహ్మద్, మళపురానికి చెందిన సిద్ధిక్, రాంపూర్‌కు చెందిన ఆలం ఉన్నారు. ఇదిలావుండగా…సిద్ధిఖ్ కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి . ఉత్తర ప్రదేశ్ పోలీసుల చర్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సంఘం తెలిపింది.

ఉత్తర్​ప్రదేశ్​లో హాథ్రస్​ ఘటన ఆధారంగా కుల ఘర్షణలను ప్రేరేపించేందుకు విదేశాల నుంచి 100 కోట్ల రూపాయలు వచ్చినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మారిషస్​ నుంచే 50 కోట్ల రూపాయలు అందినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. హాథ్రస్​ ఘటనపై హింస రాజేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. . కేసు అనేక మలుపులు తిరుగుతూఉంటే ఇంకోవైపు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ధర్నాలు జరుగుతున్నాయి. .దేశాన్ని గందరగోళంలో పడేయడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.