చైనాను అస్సలు నమ్మడానికి లేదు..

చైనాను అస్సలు నమ్మడానికి లేదు..ఓ పక్క చర్చలు జరుపుతూనే మరోప్రక్క…
సరిహద్దుకు సైన్యాన్ని, ఆయుధాలను తరలిస్తోంది..
పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న భారత సైన్యం అంతే  అప్రమత్తంగా ఉంది. ఎలాంంటి  పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంఅవుతోంది.  యుద్ధం వస్తే… కొనసాగించేందుకు అవసరమైన  ట్యాంకులు, భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం సహా అవసరమైన శీతాకాలపు సామాగ్రిని లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాలకు తరలించింది.
ఇదే విషయాన్ని  ఆర్మీ చీఫ్ నారావణే మీడియాకు వెల్లడించారు కూడా.. ఎల్ఐసి వెంట సున్నితమైన,  తీవ్రమైన పరిస్థితుల గురించి చెప్పారు.   అగ్ర కమాండర్ల బృందం సాయంతో చర్చించి ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు.ఆయన పర్యవేక్షణలోనే పనులు వేగంగా జరుగుతున్నాయి. చర్చలతో  శాంతికైనా సిద్ధం …అవసరమైతే  యుద్ధానికైనా సిద్ధం అనే గట్టి సందేశాన్ని చైనాకు సూటిగానే ఇస్తోంది భారత్