దెబ్బ‌కు దిగొచ్చిన‌ తనిష్క్ – హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్న యాడ్ తొలగింపు..

దెబ్బ‌కు దిగొచ్చిన‌ తనిష్క్

– హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఉన్న యాడ్ తొలగింపు..

ప్రముఖ జ్యుయలరీ బ్రాండ్‌ తనిష్క్‌ వివాదాస్పద యాడ్‌ కలకలం రేపిన విష‌యం తెలిసిందే. ఈ యాడ్‌ లవ్‌ జిహాదీని ప్రోత్సహిస్తోందని నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా గ‌ళం వినిపించారు. అంతేకాదు గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో తనిష్క్‌ స్టోర్‌కు, ప‌లు స్టోర్ల‌కు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రకటన సరైంది కాదని తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొంద‌రు తనిష్క్ యాజ‌మాన్యానికి చెప్పారు. తనిష్క్‌ గాంధీధామ్‌ స్టోర్‌ వద్దకు నిరసనకారులు వెళ్లారు. దీంతో స్టోర్‌ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ నోట్‌ రాసింది. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా యాడ్‌ ఉంది. అందుకే హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. చివ‌ర‌కు యాజమాన్యం దిగివచ్చింది. యూట్యూబ్‌ నుంచి యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలికి సీమంతం చేస్తున్న‌ట్లుగా ఈ యాడ్ ఉంది.ఇది లవ్‌ జిహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq అని ట్రెండ్‌ చేయడంతో దెబ్బ‌కు త‌నిష్క్ కు దిమ్మ‌తిరిగిపోయింది. ఇకపై తనిష్క్‌ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుంద‌ని చెప్ప‌డంతో మొత్తానికి యాడ్‌ను డిలిట్ చేశారు