అయోధ్య భూవివాదం పరిష్కారం కావడంతో… శ్రీ కృష్ణ జన్మభూమి విముక్తి కోసం కోర్ట్ కెక్కింది ట్రస్ట్ .

మధుర లోని శ్రీ కృష్ణ జన్మ భూమి కి సంబంధించి 13.37 ఎకరాల భూమిపై పూర్తి యాజమాన్య హక్కు ఇవ్వడంతో పాటు…ఆ  13.37 ఎకరాల భూమిలోనే ఆలయానికి ఆనుకుని ఉన్న ఈద్గా మసీదు ను  అక్కడ నుంచి తొలగించాలని కృష్ణ జన్మభూమి ట్రస్ట్ కోర్టుకు వెళ్లింది.
భగవాన్ శ్రీకృష్ణ  విరాజమాన్  తరఫున కోర్టులో రంజన్ అగ్నిహోత్రి , ఆరుగురు కృష్ణ భక్తుల తరఫున… న్యాయవాదులు హరి  శంకర్ జైన్ , విష్ణు జైన్    కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. భారతదేశంలో  దేవాలయ ఆస్తి… అందులోని దేవుళ్ల ఆస్తిగానే  ఉంటుంది.   ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో దేవాలయాలలోని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అంటే ఆ దేవుడుఅక్కడ కొలువై ఉన్నట్లు… అక్కడ కొలువై ఉన్న దేవుడికి సంబంధించిన ఆస్తులు ఎవరైనా స్వాధీనం చేసుకున్నా ధ్వంసం చేసినా… వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కుఉంటుంది…
సమాజం శక్తివంతంగా ఉన్నప్పుడు అటువంటి విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.  మన దేశం మీద దాడి చేసిన దురాక్రమణ దారుల చేత ధ్వంసం అయిన దేవాలయాలను… ఆక్రమించుకున్న  ఆస్తులను ఇప్పుడున్న వ్యవస్థలలో  కోర్ట్ లేదా ప్రభుత్వం ద్వారా సాధించుకోవచ్చు.
ఔరంగజేబ్ పరిపాలన కాలంలో 1658 జూలై 31 నుంచి 1707 మార్చి 3 వరకు దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలను సైన్యం ధ్వంసం చేసింది. ఆ క్రమంలో 1669-70 ల మధ్య మధురలోని శ్రీకృష్ణుడి జన్మభూమి లో ఉన్న మందిరాన్ని ఔరంగజేబు సైనికులు పాక్షికంగా ధ్వంసం చేసి  అక్కడ మసీదు నిర్మించారు. దానికి ఈద్గామసీద్  అని పేరు పెట్టారు. పాక్షికంగా ధ్వంసమైన  దేవాలయమే ఇప్పుడు మనం చూస్తున్నది.
ఆ మసీదు లోపలచూస్తే   దేవాలయ ఆనవాళ్లే ఇంకా మనకు కనిపిస్తాయి..  ఆధారాలు సైతం స్పష్టంగా ఉన్న నేపథ్యంలో…మధుర కృష్ణజన్మభూమి హక్కులు తమకే వస్తాయని ట్రస్ట్ చెపుతోంది.
– దేవిక