ఎయిరిండియా వన్ విశేషాలు-నిజానిజాలు దేశం అసలే ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల కోసం ప్రజల సొమ్ము వేల కోట్లు ఖర్చు చేసి ” రెండు విమానాలను కొనుక్కున్నాడు అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. సరే దానిలో నిజం ఎంతో పరిశీలిద్దాం.

ఎయిర్ఇండియావన్ విమానాలు

దేశం అసలే ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రధాని మోదీ తన విదేశీ పర్యటనల కోసం ప్రజల సొమ్ము వేల కోట్లు ఖర్చు చేసి ” రెండు విమానాలను కొనుక్కున్నాడు అని ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది.

సరే దానిలో నిజం ఎంతో పరిశీలిద్దాం.

ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ప్రధానుల మరియూ ఇతర ముఖ్యులు విదేశీ పర్యటనలకు బోయింగ్ 747 విమానాలు మాత్రమే కాకుండా , ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం నాలుగు 14 సీట్ల ఎంబ్రేర్ 135 మోడల్ , నాలుగు 20 సీట్ల ఎంబ్రేర్ 145 మోడల్ మరియు కష్టమైజ్ చేయబడి విఐపి క్యాబిన్ కలిగి ఉన్న మూడు 46 సీట్ల బోయింగ్ బిజినెస్ జెట్స్ (బిబిజె) ను వాడుతున్నారు. దేశంలో వీఐపీ ల ప్రయాణాల కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటిలో బోయింగ్ 747 లను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లేదా ప్రధాని అధికారిక విదేశీ పర్యటనలకు మాత్రమే ఉపయోగిస్తారు.

అయితే 2011లో యుపిఎ అధికారంలో ఉండగా రాష్ట్రపతి, ప్రధాని మొ. వారికోసం ఉపయోగిస్తున్న బోయింగ్ 747 విమానాలు 20 సం.లుగా వాడుతున్నారని పాత మోడల్స్ కావడంతో నిర్వహణ ఖర్చు పెరిగిపోతోందని, పెరిగిన టెక్నాలజీ దృష్ట్యా ఈ విమానాలు VVIPలకు తగినంత భద్రత కల్పించలేవని తలచి అందుకోసం VVIP లు అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానుల విదేశీ పర్యటనలు కోసం రెండు కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

దీనికోసం ఒక గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కి బాధ్యత అప్పగించారు. వీరు పది మీటింగ్స్ పెట్టుకొని ఇప్పటికే ఎయిర్ ఇండియా 2006లో ఆర్డర్ ఇచ్చిన 68 బోయింగ్ విమానాల్లో 15 విమానాలు B777 మోడల్ ఉన్నాయి. వాటిలో రెండింటిని VVIP ల ప్రయాణానికి అనువుగా మార్చుకోవచ్చు అని 2012లో సలహా ఇచ్చింది.

కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అసలు 2006 సరికే ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియా నష్టాల్లో నడుస్తోంది. ఉన్న రూట్లు లోనే ప్రైవేట్ విమానాల ధాటికి తట్టుకోలేక, సర్వీస్ బాగోలేక సీటింగ్ కెపాసిటీ కావలసినంత నిండక ఆర్ధిక ఇబ్బందులు పడుతోంది. కానీ అటువంటి సంస్థ చేత అప్పటి మంత్రి ప్రఫుల్ పటేల్ 68 కొత్త విమానాలు కొనడానికి బోయింగ్ కంపనీ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.(అవసరం లేకపోతే కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు అన్న క్లాజ్ కూడా పెట్టలేదు) అసలే నష్టాల్లో ఉన్న సంస్థ తేరుకోలేనంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. (మోడీ యే ఎయిర్ ఇండియా దివాళా కు కారణం అని ఇప్పుడు కుటుంబ బానిసలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వేల కోట్ల స్కాం మీద వేరే పోస్ట్ విపులంగా పెడతాను).

సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే UPA ఆర్డర్ ఇచ్చిన 68 బోయింగ్ విమానాల్లో 15 విమానాలు B777 మోడల్. ఈ విమానాల్లో 2017 సం. కి 12 వచ్చాయి. 2018లో మిగతావి వచ్చాయి, వాటిని ఎయిర్ ఇండియా వాణిజ్య అవసరాలకు తిప్పుకుంటోంది. వాటిల్లోనో రెండింటిని మళ్లీ వెనక్కి అమెరికా పంపి UPA ప్రభుత్వం అనుకున్నట్లుగా VVIP విమానాల క్రింద మార్పులు చేస్తున్నారు.

అంటే ఇప్పటికే UPA కొనుగోలు వప్పందం ప్రకారం ఎయిర్ ఇండియా వీటి ఖరీదును బోయింగ్ కంపెనీకి చెల్లించింది. కానీ ఈ రెండు విమానాలకు ఇప్పుడు అత్యంత కొత్త తరహా ఆధునిక భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు చేస్తూ ఉండడటం తో వీటిని ఎయిర్ ఇండియా నిర్వహించలేదు కాబట్టి వీటిని ఎయిర్ ఇండియా నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొంటున్నాది.

అంటే మోడీ తాను స్వంతంగా వాడుకుందికి ఇప్పుడు ఏ విమానాలు కొత్తగా కొనుగోలు చేయలేదు. UPA ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటికే ప్రస్తుత భద్రతా అవసరాలకు తగ్గట్లుగా మార్పులు చేశారు.

✈️ #ఎయిర్ఇండియాఒన్_విమానాలు ✈️ రెండింటిలో మొదటిది మొన్న అక్టోబర్ 1వ తేదీ భారత్ వచ్చింది..

ఇక ఈ ‘ఎయిర్ ఇండియా వన్’ విశేషాలు :

ప్రస్తుతం యుఎస్ ప్రెసిడెంట్ వాడుతున్న ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానాల్లో ఉండే సదుపాయాలు, భద్రతా వ్యవస్థ దీనిలో ఏర్పాటు చేశారు.

అమెరికా తమ దేశ ప్రెసిడెంట్ మాత్రమే వాడే
‘ఎయిర్ ఫోర్స్ వన్” విమానాల్లో ఉండే ‘సెల్ఫ్ ప్రొటెక్టీంగ్ సూట్స్’, రాడార్ వ్యవస్థ, ఎదురుగా వచ్చే మిసైల్స్ తనంత తానుగా ఎదుర్కొనే వ్యవస్థ, న్యూక్లియర్ దాడుల్లో కూడా చెక్కుచెదరని కమ్యూనికేషన్ వ్యవస్థ మొ. అధునాతన టెక్నాలజీని మొట్టమొదట సారిగా భారత్ కు అమెరికా అందుబాటులోకి తెచ్చింది.

ఈ విమానంలో రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి/ప్రధాని ఉండడానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేశారు. దానిలో పడుకోడానికి, ఆఫీస్ నడపడానికి ఏర్పాట్లు చేశారు. జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆ పై అధికారులు మాత్రమే దీనిలో VVIP ల తో కలసి ప్రయాణించడానికి అనుమతి ఇస్తారు. విమానంలో ప్రయాణించే ప్రతీ వారికి వారి హోదా తెలియచేసే విధంగా ప్రత్యేక మైన వేరు వేరు రంగుల ఐడెంటిటీ కార్డులు ఇస్తారు. దీనిలో VVIP కేబిన్ కాక మిగతా వారికోసం ఫస్ట్ క్లాస్ మరియు ఎకానమీ క్లాస్ సీట్ల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.

…చాడా శాస్త్రి…