మై ఇండ్ మీడియా టెకీ టాక్ బృందం సమర్పించు F -22 అమెరికా యుద్ధవిమాన విన్యాసాలు

అమెరికా వారి F -22 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన F -16 విమానం తరువాత వచ్చిన ఆధునిక యుద్ధ విమానం.

యుద్ధవిమానాల పోరును Dog Fight అని అంటారు. ప్రపంచంలో ప్రస్తుతం ఈ డాగ్ ఫైట్ లో పేరుపొందిన విమానాలు రెండు . మొదటిది రష్యా వారి సుఖోయ్ SU -35 రెండవది అమెరికన్ F -22. శబ్ద వేగం కన్నా ఎక్కువ వడితో వెళ్లే F -22 ని దగ్గర నుండి చుస్తే గుండెలో నొప్పి వచ్చి అడ్రినలీన్ పెరుగుతుంది.
వాషింగ్టన్ DC 2017 ఆండ్రూస్ ఎయిర్ షో లో మై ఇండ్ మీడియా వారి టెకీ టాక్ బృందం F -22 విన్యాసాలని తమ కెమెరా లో బంధించాయి. అంత వేగంగా పోతున్న విమానాన్ని జూమ్ చేసి వీడియో తీయటం కష్టం, వీలైనంతలో విమానం తో పోటీపడి తీసిన ఈ వీడియో లో ఈ క్రింది విన్యాసాలు వున్నాయి.

నిటారుగా విమానం వెళ్ళటం
శబ్ద వేగంతో వెళ్ళటం
తలకిందులుగా వెళ్లి వలయాకారంగా తిరగటం
అతితక్కువ వేగంతో నెమ్మదిగా వెళ్ళటం

ఆఫ్గనిస్తాన్లో కొండలపై పహారా కాస్తున్న అమెరికన్ సైనికులు రాత్రి పూట తాలిబన్ దొంగదాడులలో చనిపోతుంటారు. అప్పుడప్పుడు వారికీ తోడు ఉండటానికి అమెరికా వాయుసేన ఈ విమానాన్ని ఆలా ఒక రౌండ్ తిప్పి వస్తారు. ఆ చప్పుడుకే టెర్రరిస్టులు ఎక్కడ బాంబులు పడతాయోనని ఆ రాత్రి తమ దొంగదాడిలు ఆపేస్తారు.

[embedyt] https://www.youtube.com/watch?v=Ze6Zp6n-pxs[/embedyt]