రాఖీ పౌర్ణమి – Taraalu antaralu By RJ Girija – 15th Aug 2019

రాఖీ పౌర్ణమి – Taraalu antaralu By RJ Girija – 15th Aug 2019

శ్రావణమాసం విశిష్టత శ్రావణమాసం లో వచ్చే పండుగలు పర్వదినాలు గురించి తెలుసుకుందాం By RJ Girija

శ్రావణమాసం అనగానే ప్రతీఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నటు అనిపిస్తుంది. అలాంటి శ్రావణమాసం వచ్చేస్తుంది. ఈ నెలరోజులు ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు ,వ్యాపారాలు ,మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు…

Download iOS App

Download Android app