భాద్రపద మాసం విశిష్టత భాద్రపద మాసం లో వచ్చే రుషి పంచమి’ వ్రతం గురించి తెలుసుకుందాం – Taraalu antaralu By RJ Girija – 05th Sep 2019

భాద్రపద మాసం విశిష్టత భాద్రపద మాసం లో వచ్చే పండుగలు పర్వదినాలు గురించి తెలుసుకుందాం – Taraalu antaralu By RJ Girija – 05th Sep 2019

ఈ నెలలోనే కదా.వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు.తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి ‘పరివర్తన ఏకాదశి’భాద్రపదంలో పండుగలే కాదు… నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు.
వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు, అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు చెప్పినదే ‘రుషి పంచమి’ వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని ‘భాద్రపద మాసం’లో ‘శుక్ల పక్ష పంచమి’ రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్లి దంతావధానం … పరిమళ ద్రవ్యాలతో మంత్ర పూర్వకంగా స్నానం చేయాలి. ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని, అక్కడ హోమం చేయాలి.గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను
మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి.

Download iOS App

Download Android app