హైదరాబాద్ లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటలకు నీడ కనిపించని ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయన్నమాట. ఆ సమయంలో ఎండలో నిటారుగా అంటే 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడా పడదు. రెండు నిమిషాల పాటు అంటే 12:12 నుంచి 12:14 వరకు మనం ఎండలో నిలుచున్నా నీడ కనిపించదు. వచ్చే ఆగస్టు 3న కూడా హైదరాబాద్ ‘జీరో షాడో డే’ ఏర్పడనుంది. ఇటీవల బెంగళూరులోనూ ఈ అద్భుతం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గం. లకు రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.