జగిత్యాల జిల్లాలో వరద వార్తలు కవర్ చేసేందుకు వెళ్లి గల్లంతైన రిపోర్టర్ మృతదేహం లభ్యమైంది. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతదేహాన్ని రెస్క్యూ టీం నాలుగు రోజుల తరువాత గుర్తించింది. చెట్లకొమ్మల్లో అతని బాడీ చిక్కుకుపోయి ఉంది.బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి పంపి పోస్టు మార్టం నిర్వహించారు. రిపోర్టర్ కారు కూడా దొరికింది. క్రేన్ సాయంతో రెస్క్యూ టీం దాన్ని కూడా బయటకుతీసింది.
రాయకల్ మండలం బోర్నపల్లిలో గోదావరిలో వ్యవసాయ కూలీలు చిక్కుకోగా కవర్ చేయడానికి జమీర్ వెళ్లారు. భూపతిపూర్ డ్యామ్ దగ్గర రోడ్డుపైనుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆగకుండా ముందుకెళ్లడంతో కారుతో సహా కొట్టుకుపోయాడు. అతనితోపాటు ఉన్నమరోవ్యక్తి కారునుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా…జమీర్ వరదల్లో కొట్టుకుపోయి శవమై తేలాడు.