ఇద్దరు యువకులు కార్లో వెళ్తూ కరెన్సీ నోట్లు విసిరేసిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానా గురుగ్రామ్ లో ఈ ఘటన జరిగింది. నగరంలోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో వెళ్తూ ఈ పని చేశారు. ఓ యువకుడు కారు డ్రైవ్ చేస్తుండగా ముఖానికి ముసుగేసుకున్న మరో యువకుడు నోట్లను విసిరాడు. ఈ వీడియో వైరల్ అవుతుండడంతో పోలీసులు విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు. యూట్యూబర్ జరావర్ సింగ్ తో పాటు అతని స్నేహితులు ఇన్ స్టాలో రీల్స్ కోసం ఈ పనిచేశారు. షాహిద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఫర్జీ సినిమాలో సీన్ లానే చేయాలనుకుని వారీపనిచేసినట్టు తెలిపారు.వారు విసిరేసిన నోట్లు నకిలీవని గుర్తించారు.
Two Haryana men throw currency notes from moving car
YouTuber Joravar Singh Kalsi arrested #farzi#Reels pic.twitter.com/3TchMW1mD9— NewsNowNation (@NewsNowNation) March 15, 2023
Two arrested for throwing currency notes from running car in Haryana's Gurugram
Read @ANI Story | https://t.co/uU0gqSfCp9#Gurugram #Haryana #CurrencyNotes pic.twitter.com/AvGnevRKXU
— ANI Digital (@ani_digital) March 14, 2023