తమిళనాడుకు చెందిన యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అసోంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. గువాహటి నుంచి షిల్లాంగ్ కు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో విశ్వదీనదయాళన్ మృతిచెందాడు. 83 వ సీనియర్ జాతీయ అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన దీనదయాళన్ ప్రమాదంలో చనిపోవడంతో తమిళనాడులోని ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరో ఇద్దరు క్రీడాకారులతో కలిసి పోటీలకోసం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న భారీ వాహనమొకటి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. టాక్సీ డ్రైవర్ అక్కడే చనిపోగా తీవ్ర గాయాలతో ఉన్న విశ్వను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే విశ్వచనిపోయినట్టు టేబుల్ టెన్నిస్ సమాఖ్య తెలిపింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)