అవినీతి అధికారుల విషయంలో కఠినంగా ఉంటున్నారు యూపీ సీఎం యోగీ. తమ సిబ్బందిని గుడ్డిగా నమ్మవద్దని మంత్రులకు సూచించారు. పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేతో పాటు… మరో ఐదుగురు అధికారులను యోగీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. డిపార్ట్ మెంట్ బదిలీల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ అక్రమాలకు బాధ్యుడు జితిన్ కు సన్నిహితుడైన అనిల్ పాండే అని తేలింది. దీంతో మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో మంత్రులకు సూచనలు చేస్తూ..అధికారులను గుడ్డిగా నమ్మొద్దన్నారు యోగీ. మంత్రులు తమ శాఖాధికారులు, వారి కార్యకలాపాలపై నిఘా ఉంచాలనీ ఆదేశించారు.
https://twitter.com/myogioffice/status/1549561972173451264?s=20&t=qSo0_x6ciZ0JRhN3_c58rw
అయితే తన టీంలోని ఒక అధికారిని ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి జితిన్ ప్రసాద రాజీనామా చేసి బీజేపీలో చేరారు. యోగి మంత్రివర్గంలో కీలకమైన ప్రజాపనుల శాఖ మంత్రి పదవి ఇచ్చారు. ఆ శాఖ పరిధిలో పలువురు అధికారులు బదిలీల కోసం లంచాలు తీసుకుంటున్నట్టు గుర్తించడంతో దీనిపై విచారణకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. బదిలీలు, పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో జితిన్ ప్రసాద్ ఓఎస్డీ అనిల్ కుమార్ పాండే కూడా ఉండడంతో చర్యలు తీసుకున్నారు యోగీ. పాండేను తొలగించి ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభించారు. పాండే బాస్‌గా జితిన్ ప్రసాద కూడా అవినీతి అంశంపై ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది.
UPA ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జితిన్ ప్రసాదకు పాండే పనిచేశారు. తరువాత డిప్యుటేషన్‌పై లక్నోకు తీసుకువచ్చారు. డిపార్ట్మెంట్ బదిలీల్లో అక్రమాలకు ప్రత్యక్షంగా ఆయనే బాధ్యులని తేలింది. ముఖ్యమంత్రి సైతం జితిన్ ప్రసాదను పిలిపించి పాండేపై ఉన్న అవినీతి ఆరోపణలపై నిగ్గుతేల్చే బాధ్యత తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఆ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు యోగీ.
ప్రభుత్వ వైద్యుల బదిలీ ఉత్తర్వుల్లో పొరపాటు జరిగిందని ఆరోపిస్తూ రాష్ట్రానికి చెందిన 100 మందికి పైగా వైద్య నిపుణులు గత వారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ హెల్త్‌కు లేఖ రాశారు. మరణించిన వైద్యుల బదిలీ, జంట పోస్టింగ్‌ను ఉల్లంఘించి బదిలీ చేయడం, గతంలో బదిలీ అయిన ఏడాదిలోపు బదిలీ చేయడం వంటి లోపాలు ఉన్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తోంది యోగీ ప్రభుత్వం. 2018 సంవత్సరంలో, IAS, IPS, PCS, PPS అధికారులతో సహా 100 మందికి పైగా కళంకిత క్లాస్ I అధికారుల రికార్డులను ముఖ్యమంత్రి కోరింది, వారి పేర్లు వారి సర్వీస్ కాలంలో ఏ సమయంలోనైనా అవినీతి కేసులలో ఉన్నాయి. అలాగే, 2019లో యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలపై ఏడుగురు ప్రొవిన్షియల్ పోలీస్ సర్వీస్ (పిపిఎస్) అధికారులను తొలగించాలని నిర్ణయించింది.
అవినీతి వ్యతిరేక డ్రైవ్ లో ఇప్పటికే 4 వందల మంది అవినీతి అధికారులను శిక్షిస్తామని హెచ్చరించింది. వారిలో 2 వందల మందికి రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంది. అంతకుముందు 2019లో డజనుకుపై ఎఐఆర్ నమోదైంది.
అయితే సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్న జితిన్ ప్రసాద దీనిపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ కోరారు.