ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్కెచ్ ఎప్పుడూ మామూలుగా ఉండదు. ఒకసారి టార్గెట్ ఫిక్స్ అయితే… బ్లైండ్ గా దూసుకొని పోతాడు. మధ్యలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనక్కి తగ్గేదేలే.. అన్నది యోగీ ఫిలాసఫీ. అందుకే అయోధ్య లో భవ్యమైన రామమందిరం అనే కల సాకారం అయింది అంటే అందులో యోగీ ఆదిత్యనాథ్ పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే సంబాలా మసీదు విషయంలో కూడా యోగీ ఆదిత్యనాథ్ స్కెచ్ సూపర్ సక్సెస్ అయింది.
అసలు సంబాలా మసీదు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. సంబాలా పట్టణంలో బాబర్ నిర్మించిన మసీదు దేవాలయ పునాదుల మీద నిర్మించినదే అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కొన్ని రోజుల క్రితం ఇదే వాదనలతో స్థానిక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు అయింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఒక ప్రతిపాదన చేసింది. రెండు పక్షాల న్యాయవాదుల సమక్షంలో కోర్టు కమిషనర్ ను నియమించారు. కానీ, బాబ్రీ మసీదు దగ్గర కోర్టు కమిషనర్ అడుగు పెట్టగానే ఒక్కసారిగా బీభత్సం చోటు చేసుకొంది. మసీదు లోపల ఉన్న వందలాది యువకులు పెద్ద ఎత్తున రాళ్ల దాడి మొదలు పెట్టారు. కోర్టు అధికారులు అడుగు తీసి ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. సర్వే మాట దేవుడు ఎరుగు, ప్రాణాలు దక్కితే చాలు అనుకొని వెనక్కి పరుగులు తీశారు. దీంతో సంబాలా మసీదు ఎపిసోడ్ ముగిసింది అని అంతా అనుకొన్నారు.
కానీ, ఇక్కడే యోగీ ఆదిత్యనాథ్ తనదైన స్కెచ్ ను అమలు చేశారు. నాలుగు రోజులు కామ్ గా ఊరుకొని, ఆకస్మికంగా టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపారు. సంబాలా మసీదు చుట్టుపక్కల విద్యుత్ చౌర్యం జరుగుతోంది అన్న ఫిర్యాదు మీద ఆఫీసర్స్ ను రంగంలోకి దించారు. జిల్లా స్థాయిలోని రెవిన్యూ, పోలీసు, విద్యుత్ అధికారులు ఒక టీమ్ లా ఏర్పడి తెల్లవారు జామునే బాబ్రీ మసీదు చుట్టు పక్కల ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆ తనిఖీల్లో కళ్లు తిరిగే వాస్తవాలు బయట పడ్డాయి. అనేక చోట్ల విద్యుత్ చౌర్యం నిర్భయంగా జరిగిపోతోందిఅని గుర్తించారు. చలికాలంలో తెల్లవారు జామునే సోదాలు చేయటంతో ఒక్కసారిగా అక్రమాలు బయట పడ్డాయి. ఈ లోగానే స్థానికులు అక్కడకు చేరుకొని దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఒక వైపు విద్యుత్ అక్రమాలను వెలికి తీయటంతో పాటు, తమ టార్గెట్ ను కూడా రీచ్ అయిపోయారు.
సంబాలా మసీదు దగ్గరలోనే భూమి కింద మరుగున పడిన శివాలయాన్ని వెలికి తీశారు. అక్కడ శివలింగం, ఎదురుగా నంది విగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శక్తివంతమైన హనుమాన్ విగ్రహం కూడా దర్శనం ఇచ్చింది. పోలీసుల సోదాల్లో ఈ విషయం బయట పడగానే సోదాలను వీడియోలతో రికార్డు చేయించారు. కిందకు తవ్వుకొంటూ వెళ్లినప్పుడు, పూర్తి స్థాయిలో విగ్రహాలన్నీ బయట పడ్డాయి. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనిని బట్టి బాబ్రీ మసీదు అసలు చరిత్ర ఏమిటి అన్నది తేలికగా అర్థం అయిపోతోంది.
బాబ్రీ మసీదు తో పాటు అనేక మసీదుల బాగోతాన్ని యోగీ ఆదిత్యనాథ్ బయట పెట్టేశారు. గుడులు నాశనం చేసి, మసీదులు కట్టేశారు అన్న వాస్తవం బట్టబయలు అయ్యింది. అందుకే యోగీ అంటే మైనార్టీలకు, సెక్యులరిస్టలకు తగని మంట. అందుకే యోగీని అబిమానులు అంతా… మగాడ్రా బుజ్జీ అని అభిమానంగా పిలుచుకొంటారు.