బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ పఠాన్ విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన బేషరం రంగ్ పాటపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అందులో దీపికా పడుకొనే కాషాయరంగు బికినీ ధరించి ఉంటుంది. వారిద్దరి పోజులు సైతం అశ్లీలంగా ఉన్నాయి. దానిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగానే అందులోని దీపిక మొఖం స్థానంలో యోగీ ఆదిత్యనాథ్ మొహాన్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు కొందరు. ఆజార్ ఆర్కే అనే యువకుడు ఆ మార్ఫింగ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు, బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.
https://twitter.com/SaurabhSMUP/status/1604411943237713925?s=20&t=JWMaJuuzD5j8-wkFbSZMiA