ఏ పని చేసినా ముక్కు సూటిగా ఉండడం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అలవాటు. కొంతకాలంగా ఉత్తర్ ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన విస్తారంగా కష్టపడుతున్నారు. శాంతి భద్రతలను అదుపు చేయడం, అల్లరి మూకలకు కళ్లెం వేయడం, యువత ఉపాధి కోసం పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టించడం వంటి చర్యలు ఆయన చేపడుతున్నారు. గతంలో సుదీర్ఘకాలం పాటు ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్, సమాజ్ వాది వంటి పార్టీలు అడ్డగోలుగా డబ్బులు తినడానికి బాగా అలవాటు పడ్డాయి. నిజాయితీగా నిబద్దత తో పనిచేస్తున్న యోగి అంటే ఈ పార్టీలకు కడుపు మండిపోతోంది. దీంతో యోగి ఆదిత్యనాథ్ మీద తెర వెనుక కుట్రలకు తెర తీశారు.
మొన్నటి కి మొన్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా భయంకరమైన అబద్ధాలు ప్రచారం చేశారు. దొంగ దారిలో రిజర్వేషన్లు కొట్టేస్తున్న మైనార్టీలకు చెక్ పెడతామని,, బడుగు బలహీన వర్గాలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు అందిస్తామని యోగితో పాటుగా బిజెపి పెద్దలు స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈ మాటలను వక్రీకరించి బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అంటూ సోషల్ మీడియా వేదికగా విషపు ప్రచారాన్ని కొనసాగించారు. ఇటువంటి అడ్డగోలు అబద్ధాలతో మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బిజెపికి నిరాశకరమైన ఫలితాలు లభించాయి. దీనికి తోడు అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో కూడా తీవ్ర ఎత్తున గందరగోళం ఏర్పడుతోంది.
సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయడం దొంగ వీడియోలు సర్కులేట్ చేయడం కారణంగా సమాజంలో అనిశ్చితి ఏర్పడుతుంది . దీనిని నివారించేందుకు ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీకి యోగి ఆదిత్యనాథ్ పదును పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అదేపనిగా చేసినట్లయితే అరెస్టు చేయించి జైలుకు పంపిస్తామని స్పష్టం చేస్తున్నారు సుమారు మూడు సంవత్సరాల దాకా జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్లకు షాక్ ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
దీంతో పాటుగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించే సోషల్ మీడియా ఛానల్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లకు నగదు ప్రకటించింది . ప్రభుత్వం తరఫున ఏ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని అందుకోవడం ఎలా.. అనే అంశాల మీద ప్రజల్లో అవగాహన కలిగించినట్లయితే సామాన్య జనం వాటిని చక్కగా ఉపయోగించుకుని లబ్ది పొందుతారు.
మొత్తం మీద సమాజానికి ఉపయోగపడే పని చేసినట్లయితే మెచ్చుకుంటామని అంటున్నారు . సమాజానికి హాని కలిగించే చెత్త పనులు చేస్తే తాట తీస్తామని యోగి స్పష్టంగా తేల్చి చెప్పేశారు. దీని మీద కూడా కొంతమంది తాటాకుల కట్టడం మరో విచిత్రం.