అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ లో ఆయుష్ విభాగ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.
యోగా శిక్షకులు చేసిన యోగాసనాలను వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు
యోగాను నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ భాగంగా చేసుకోవాలని జిల్లాలో 22 మంది యోగ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు అని పేర్కొన్నారు.
యోగాసనాలు, ముద్రలు, పిల్లలకి పరిచయం చేసినట్లయితే వారు కొంతవరకు మొబైల్ కు దూరంగా ఉండే అవకాశం ఎక్కువ అని అన్నారు.
పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ తో గడుపుతున్నారని దాని నుండి దూరం చేసే అవకాశం యోగాకు ఉందని పేర్కొన్నారు . విద్యార్థులను మంచి మార్గంలోకి వెళ్లేలా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుందని అన్నారు.
అదిలాబాద్ ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వాణి మాట్లాడుతూ అదిలాబాద్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున యోగా సెంటర్స్ ని అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించడం శుభపరిణామమని వివరించారు . ఆయుర్వేద, యునాని, హోమియో మూడిటికి సంబంధించి రెండు యోగా గదులు ఉన్నాయని ఈ గదులలో యోగాసనాలకు సంబంధించి చిత్రాలు, యోగాకు సంబంధించి నినాదాలు ఉన్నాయని చెప్పారు . ప్రతి ఒక్క డిస్పెన్సరీలో అదిలాబాద్ జిల్లాలో 12 ఆరోగ్య ఆయుష్ కేంద్రాలు గా గుర్తించి , అక్కడ అన్నింటిలో యోగావిభాగాలు నిర్మించడం జరిగింది . వాటన్నింటిలో యోగ ఇన్స్ట్రక్టర్స్ ని నియమించడం జరిగింది. వీటి కోసం 12 మంది మహిళా ఇన్స్ట్రక్టర్స్ నీ,10 మంది పురుషులు ఇన్స్ట క్టర్స్ ని ఎంపిక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్,జిల్లా వైద్యాధికారి నరేందర్,డాక్టర్ చందు, ఆయుష్ విభాగపు వైద్యాధికారి వాణి,సుధాకర్, ప్రీతం రాథోడ్ , వైద్యాధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.